వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహం ఓ మ‌ధురం..! స్నేహం ఓ వ‌రం..!!

|
Google Oneindia TeluguNews

స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగ నిను వీడి పోదురా..,దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్.. వాస్తవం రా దోస్త్.. నువ్వే నా ప్రాణం" అంటూ సినీ కవులు కవిత్వం రాసినా.. స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిదే...! అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం గొప్ప‌ద‌నం ఏంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

 స్నేహితుడి కోపాన్ని..లోపాన్ని భ‌రించ‌డ‌మే నిజ‌మైన స్నేహం..!

స్నేహితుడి కోపాన్ని..లోపాన్ని భ‌రించ‌డ‌మే నిజ‌మైన స్నేహం..!

ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం.
తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుక్కొనాలనే ఆలోచనను కూడా కలిగిస్తుంది.

 కంటికి దూర‌మైనా మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌గా ఉండేదే స్నేహం..!

కంటికి దూర‌మైనా మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌గా ఉండేదే స్నేహం..!

ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని, మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితుల��ో నిర్మొహమాటంగా చర్చించుకోవడం స్నేహితుల మధ్య జరిగే అతి సాధారణ ప్రక్రియ. ఇక ఈ స్నేహితుల రోజు వెనుక ఉన్న కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..! 1935వ సంవత్సరం ఆగస్ట్ మొదటి శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో హతమైన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తరువాత రోజైన ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం ఆగస్ట్ మొదటి ఆదివారాన్ని "ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే"గా ప్రకటించింది.

 స్రుష్టిలో అమ్మ త‌ర్వాత క‌మ్మ‌నైన ప‌దం స్నేహం..!

స్రుష్టిలో అమ్మ త‌ర్వాత క‌మ్మ‌నైన ప‌దం స్నేహం..!

ఇక అప్పటినుంచి ఈ ఫ్రెండ్‌షిప్ డే అలా అలా వ్యాపిస్తూ విశ్వవ్యాప్తమయ్యింది. స్నేహం అనేది ఇద్దరు పరిచయస్తుల మధ్య మాత్రమే ఉండే బంధం కాదు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు.... ప్రతీ వ్యక్తిలో ఉండాల్సిన ముఖ్యమైన భావన. స్నేహం అనేది ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు తగ్గి ఒకరినొకరు అర్ధం చేసుకుని మసులుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనివలన సమస్యలు తీవ్ర రూపం దాల్చకముందే పరిష్కారమవుతాయి. స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి. కాని ఒక్కోసారి స్నేహం కూడా దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అందరినీ స్నేహితులని నమ్మి మోసపోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది.

స్నేహాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేసే న‌కిలిగాళ్ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి..

స్నేహాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేసే న‌కిలిగాళ్ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి..

ప్రతీదానికి మంచి చెడు ఉన్నట్టే స్నేహం విషయంలోనూ ముందు జాగ్రత్త, నమ్మకం చాలా ముఖ్యం.. యువతీ, యువకులే కాక అరమరికలు లేని స్నేహానికి గుర్తుగా ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం ఎంతో ఉత్సాహంగా ఈ రోజును జరుపుకుంటారు. ఈ రోజుల్లో "అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం" యువత మధ్య పెద్ద క్రేజ్‌గా మారింది. తమ స్నేహితులను కలవడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు. స్నేహితుల ఇళ్లకు వెళ్లి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు కడుతుంటారు. ఇలాగే స్నేహంలోని సరిగమలను ఆస్వాదిస్తూ.. చిన్నా, పెద్దా బేధం లేకుండా... ఈ స్నేహ మధురిమలను కలకాలం నిలుపుకోవాలని మనసారా కోరుకుందాం...!!

English summary
Every individual celebrates friendship day as great as well. no man in this world have friends. friendship is precious. every year in august 1st Sunday international friendship day celebrates greatly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X