వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహమే ముఖ్యం, సరిహద్దు సహకారం: నేపాల్ ప్రధాని ఓలితో మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌తో సత్సంబంధాలకు తామెంతో ప్రాముఖ్యత ఇస్తామని నేపాల్‌ ప్రధాని ఓలి అన్నారు. శనివారం దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో నేపాల్‌ పెట్రోలియం ప్రొడెక్ట్స్‌ పైప్‌లైన్‌ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు జాయింట్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. 'నేపాల్‌ అభివృద్ధిలో భారత్‌ చేసిన కృషికి సుదీర్ఘ చరిత్ర ఉంది. భవిష్యత్‌లో ఆ దేశ అభివృద్ధికి తోడ్పాటును కొనసాగిస్తూనే ఉంటాం. నేపాల్‌తో జల, రైల్వే మార్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉన్నాం. భారత్‌-కాఠ్‌మాండూను కలిపే విధంగా కొత్త రైల్వే లైను వేసేందుకు అంగీకరించాం. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన పలు ప్రాజెక్టుల అభివృద్ధి గురించి విస్తృతంగా చర్చలు జరిపాం. సరిహద్దులో భద్రత విషయంలోనూ ఒకరికొకరం సహకరించుకుంటాం' అని వ్యాఖ్యానించారు.

అనంతరం ఓలి మాట్లాడుతూ భారత్‌తో సంబంధాలకు నేపాల్‌ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి భారత్‌తో మంచి సంబంధాలను కలిగి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని నేపాల్‌లో పర్యటించాల్సిందిగా ఓలి ఆహ్వానించారు.

వీలైనంత త్వరగా మోడీ నేపాల్‌లో పర్యటిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన నేపాల్‌ ప్రధాని ఓలికి శనివారం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా స్వాగతం పలికారు.

English summary
Nepal's Prime Minister Khadga Prasad Oli, who was accorded a ceremonial reception at the Rashtrapati Bhawan in Delhi today (April 7), said that friendship with neighbours, especially with India is very important. PM Oli also met President Ram Nath Kovind and Prime Minister Narendra Modi during the ceremonial welcome.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X