వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అండర్ వరల్డ్ డాన్‌కు ముచ్చెమటలు పట్టించిన ఎలక్షన్ రిజల్ట్స్..! కారణమేంటో తెలుసా?

|
Google Oneindia TeluguNews

అతనో అండర్ వరల్డ్ డాన్. తన గ్యాంగ్‌తో ఒకప్పుడు దేశాన్ని గడగడలాడించారు. అనంతరం పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో భారత్‌లో ఆటలు సాగలేదు. దీంతో పొరుగుదేశానికి పారిపోయాడు. ఏళ్లుగా పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నాడు. ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ డాన్ ప్రభుత్వం మారితే కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు అనుకున్నాడు. కానీ మే 23న వెలువడిన ఫలితాలు చూసి ఆయనకు ముచ్చెమటలు పట్టాయట. ఇంతకీ ఎవరా డాన్ అనుకుంటున్నారా? ఇంకెవరూ మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహిం.

దారుణం : స్మృతి ఇరానీ అనుచరుడ్ని కాల్చి చంపారు..దారుణం : స్మృతి ఇరానీ అనుచరుడ్ని కాల్చి చంపారు..

రహస్య జీవితం గడుపుతున్న దావూద్

రహస్య జీవితం గడుపుతున్న దావూద్

ప్రధానిగా నరేంద్రమోడీ మరోసారి అధికారం చేపట్టనున్నారన్న వార్తలతో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం వణికిపోయాడట. ఆ రోజు అతను తీవ్ర ఆందోళనకు గురైనట్లు ఇంటలిజెన్స్ వర్గాలు చెప్పినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. 2014లో మొదటిసారి అధికారం చేపట్టిన నరేంద్రమోడీ... దావూద్, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో ఒకప్పుడు పాక్‌లో స్వేచ్ఛగా తిరిగిన దావూద్ ఇప్పుడు ఐఎస్ఐ నీడలో రహస్య జీవితం గడుపుతున్నాడు. తన స్థావరం నుంచి అడుగు బయటపెట్టేందుకు జంకుతున్నాడు.

ఐఎస్ఐ అధికారులతో చర్చ

ఐఎస్ఐ అధికారులతో చర్చ

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భారత్‌లో అధికార మార్పుపై దావూద్ గంపెడాశ పెట్టుకున్నాడు. ఒకవేళ ప్రభుత్వం మారితే కొంత రిలాక్స్ అవ్వచ్చని భావించాడు. అయితే తన ఆశలపై నీళ్లు చల్లుతూ ఈసారి ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభజనం సృష్టించింది. దీంతో ఐఎస్ఐలో కొందరు సీనియర్ అధికారులకు ఫోన్ చేసిన దావూద్ తనకు మరింత రక్షణ ఇవ్వాలని కోరినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. మోడీ మళ్లీ ప్రధాని కానుండటంతో భారత్‌, అమెరికా, ఇజ్రాయెల్ సంబంధాలు మరింత మెరుగుపడి తనకు ముప్పు మరింత పెరుగుతుందన్న ఆందోళన దావూద్‌లో నెలకొంది.

దావూద్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్

దావూద్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్

ఎన్నో ఏళ్లుగా పాక్‌లో దాక్కున్న దావూద్ పాకిస్థాన్ నుంచి బయటకు రప్పించేందుకు భారత్ ఆపరేషన్ చేపడుతుందని భయపడుతున్నాడు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోబల్ దూకుడుగా వ్యవహరిస్తే తన పని అంతే అని భావిస్తున్నాడు. మోడీ సర్కారు ఇప్పటికే దావూద్ ఆస్తుల్ని సీజ్ చేయడంతో పాటు సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను అరెస్ట్ చేసింది. ఇదిలా ఉంటే మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతున్నందున దావూద్ విషయంలో పాక్‌పై ఒత్తిడి పెరగడం ఖాయమని, దాయాది దేశం ఆయనను అప్పగించే అవకాశాలు లేకపోలేదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Dawood, who is hiding in Pakistan for over two decades, is rattled and afraid of PM Mr. Modi’s comeback to power, for another five-year term. Soon after the Lok Sabha poll results were announced, the fugitive don made a call to ISI and urged it to protect him from Indian security agencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X