వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్న ఆటో డ్రైవర్, నేడు ఓ నగర మేయర్: ఇది రాహుల్ ప్రస్థానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

పుణే: రాహుల్ జాదవ్.. బీజేపీ నాయకులు. ఒకప్పుడు సిక్స్ సీటర్ ఆటో డ్రైవర్. ఇప్పుడు మహారాష్ట్రలోని పుణే జిల్లాలోని పింప్రి చించ్‌వాడ్ మేయర్! నరేంద్ర మోడీ టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు ఎదిగారు. ఇప్పుడు ఈ మేయర్ ఆటో డ్రైవర్ నుంచి మేయర్ స్థాయికి ఎదిగారు.

ఇతని వయస్సు 36. చిక్లిలోని జాదవ్వాడి ప్రాంతంలో జన్మించారు. అతను పదో తరగతి వరకు చదువుకున్నారు. 1996 నుంచి 2003 మధ్య ఇతను ఆటో నడిపి జీవనం వెళ్లదీశాడు. ఆ తర్వాత వ్యవసాయం చేశాడు. ప్రయివేటు కంపెనీని నిర్వహించాడు. ఆ తర్వాత 2006లో అతను రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పుడు మౌలీ జాదవ్ అనే బీజేపీ కార్పోరేటర్ కోసం పని చేశారు.

2012లో ఎంఎన్ఎస్ తరఫున, 2017లో బీజేపీ నుంచి గెలుపు

2012లో ఎంఎన్ఎస్ తరఫున, 2017లో బీజేపీ నుంచి గెలుపు

ఆ తర్వాత ఆరేళ్లకే అంటే 2012లో రాహుల్ జాదవ్ ఎంఎన్ఎస్ తరఫున కార్పోరేటర్‌గా చిక్లి నుంచి గెలిచారు. అతనికి 2012 మున్సిపల్ ఎన్నికల సమయంలో భోసారి బీజేపీ ప్రజాప్రతినిధి అండగా ఉన్నారు. ఆ తర్వాత 2017లో బీజేపీలో చేరారు.

నాడు దక్కని మేయర్ పీఠం

నాడు దక్కని మేయర్ పీఠం

2017 ఫిబ్రవరిలో బీజేపీ తరఫున వార్డ్ పానెల్ 2సీ నుంచి కార్పోరేటర్‌గా గెలిచారు. అప్పటికే ఇతను కూడా బీజేపీ తరఫున మేయర్ రేసులో ఉన్నారు. కానీ నితిన్ కల్జె ఇక్కడ తొలిసారి బీజేపీ తరఫున మేయర్ పీటం దక్కించుకున్నారు. ఫిబ్రవరి - మార్చి 2018లో అతను బీజేపీ స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా ఎంపికయ్యారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ రేసులోను నిలిచారు. కానీ మమతా గైక్వాడ్‌కు దక్కింది. ఆ తర్వాత రాహుల్ జాదవ్ స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా రాజీనామా చేశారు.

ఆయన పదవీకాలం ముగియడంతో

ఆయన పదవీకాలం ముగియడంతో

2017లో బీజేపీ నుంచి పోటీ చేసిన రాహుల్ జాదవ్ రెండోసారి కూడా కార్పోరేటర్‌గా గెలిచారు. ఇక్కడ బీజేపీ మేయర్ పీఠం దక్కించుకుంది. మేయర్ పదవి దక్కిన నితిన్ కల్జే పదవీకాలం ముగిసింది. దీంతో రాహుల్‌ను మేయర్ పీఠం వరిస్తోంది. బీజేపీ ఆయననే మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది.

80 ఓట్లు రాహుల్ జాదవ్‌కు

80 ఓట్లు రాహుల్ జాదవ్‌కు

శనివారం మేయర్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. రాహుల్ జాదవ్ 80 ఓట్లతో మేయర్‌గా గెలుపొందారు. అతడి ప్రత్యర్థి వినోద్ నాథేకు 33 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా, రాహుల్ జాదవ్ మేయర్ కావడంతో స్థానిక ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

English summary
While PM Modi claims that he was chai-wallah during his early days, Rahul Jadhav, the mayor of the Pimpri Chinchwad Municipal Corporation in Pune district, was actually an auto-rickshaw driver.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X