• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎంగా బీజేపీ అభ్యర్ధి బాగుండేది -నితీశ్ కుమార్ సంచలనం -ఇంజనీర్ నుంచి సుశాసన్‌బాబుగా..

|

ప్రత్యర్థుల అనుమానాలకు తెరదించుతూ, ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఆదివారం ఏకగ్రీవంగా తమ శాసనసభాపక్ష నేతగా జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ను ఎన్నుకున్నారు. దీంతో నాలుగోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సీఎంగా తనది నాలుగో టర్మ్ అయినా, వివిధ కారణాలతో పలుమార్లు ప్రమాణం చేయాల్సివచ్చింది. సోమవారవారం సీఎంగా ఆయన ఏడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం బీహార్ ఎన్డీఏలో జూనియర్ స్థాయికి చేరిన ఆయన ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే..

పాపం నితీశ్ కుమార్ -సీఎం పదవికి బీజేపీ 'స్క్రిప్ట్' -సంచలనాలు చూడబోతున్నాం: మనోజ్ ఝాపాపం నితీశ్ కుమార్ -సీఎం పదవికి బీజేపీ 'స్క్రిప్ట్' -సంచలనాలు చూడబోతున్నాం: మనోజ్ ఝా

బీజేపీకి సీఎం పదవిపై..

బీజేపీకి సీఎం పదవిపై..


ఎన్డీఏ ఎమ్మెల్యేలందరూ తననే నాయకుడిగా ఎన్నుకున్నప్పటికీ.. ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి ఉంటేనే బాగుండేదంటూ నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు. తాజా ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 74 సీట్లతో సీనియర్ గా మరగా, 43 స్థానాలకు పరిమితమైపోయిన జేడీయూ జూనియర్ పాత్రను పోషించనుంది. ఇప్పటికే నితీశ్ కలల పథకం ‘మద్యనిషేధాన్ని' తొలగించాలని బీజేపీ కోరుతున్న నేపథ్యంలో రాబోయే ఐదేళ్లు ఆయన పాలనపై బీజేపీ ఒత్తిడి ఏమేరకు ఉండబోతున్నదనేది చర్చనీయాంశమైంది.

అహ్మద్ పటేల్ ఆరోగ్యం విషమం -నెలన్నరగా కరోనాతో పోరాటం - దెబ్బతిన్న ఊపిరితిత్తులుఅహ్మద్ పటేల్ ఆరోగ్యం విషమం -నెలన్నరగా కరోనాతో పోరాటం - దెబ్బతిన్న ఊపిరితిత్తులు

జంగిల్ రాజ్ నుంచి సుశాసననం దిశగా..

జంగిల్ రాజ్ నుంచి సుశాసననం దిశగా..

15 ఏళ్ల కిందటి వరకూ బీహార్ లో పట్టపగలే నేరాలు విశృంఖలంగా జరిగేవి. కిడ్నాప్, మత ఘర్షణలు, అరాచకాలు చాలా ఎక్కువగా ఉండేవి. నాటి ఆర్జేడీ పాలనను ‘జంగిల్ రాజ్'గా పొలిటికల్ పండితులు అంటుంటారు. అలాంటి రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితీశ్ కుమార్ బీహార్ ను అన్ని రంగాల్లో ముందుకు నడిపారు. గతంలో కంటే మెరుగైన పాలన అందిస్తూ, ‘సుశాసన్ బాబు'గా పేరు తెచ్చుకున్నారు. 2000 సంవత్సరంలో తొలిసారి ముఖ్యమంత్రి అయిన నితీశ్ కుమార్ ఆ పదవిలో 8 రోజులున్నారు. 2005, 2010, 2015 ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో పూర్తికాలం పదవిలో ఉన్నారు.

ఇంజనీర్ టు పాలిటిక్స్..

ఇంజనీర్ టు పాలిటిక్స్..

జనతా రాజకీయాల నుంచి ఎదిగొచ్చిన బీసీ నేతల్లో కుర్మీ వర్గానికి చెందిన నితీశ్ కుమార్ ప్రముఖుడు. 1951, మార్చి 1న ఆయన జన్మించారు. తండ్రి కవిరాజ్ రామ్ లఖన్ సింగ్ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నార. తల్లి పేరు పరమేశ్వరీ దేవి. 1972లో బీహార్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి నితీశ్ మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. కాలేజీ స్కాలర్ షిప్ తో పుస్తకాలు కొని, విపరీతంగా చదివేవారాయన. కొంతకాలం బీహార్ విద్యుత్ శాఖలో ఉద్యోగం చేసి, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1973లో నితీశ్.. మంజు కుమారి సిన్హాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు(నిషాంత్ కుమార్) ఉన్నారు. నితీశ్ భార్య మంజు 2007లో న్యూమోనియాతో కన్నుమూశారు.

జేపీ, లోహియా ప్రేరణతో..

జేపీ, లోహియా ప్రేరణతో..


స్వాతంత్ర్యం తరువాత 30 ఏళ్లకే దేశరాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన సోషలిస్టు నేతలు జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఎస్‌ఎన్ సిన్హా, వీపీ సింగ్‌లతో కలిసి నితీశ్ పనిచేశారు. వారి ప్రేరణతోనే తాను పరిపాలన సాగిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. 1974 నుంచి 1977 వరకు జేపీతో కలిసి నేరుగా ఉద్యమాల్లో పాల్గొన్న నితీశ్.. ఎస్‌ఎన్ సిన్హా నేతృత్వంలోని జనతా పార్టీలో చేరడం ద్వారా పొలిటిక్ కెరీర్ ప్రారంభించారు. 1977లో తొలిసారి హర్‌నౌత్ అసెంబ్లీ స్థానం నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 1985లో ఇదే స్థానం నుంచి గెలిచి, తొలిసారి ఆయన శాసన సభకు ఎన్నికయ్యారు. 1989లో జనతా దళ్ జనరల్ సెక్రటరీ పదవిని చేపట్టారు. 1990లో బాడ్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో ఆరుసార్లు ఆయన ఎంపీగా పనిచేశారు.

నైతిక విలువలకు కట్టుబడి..

నైతిక విలువలకు కట్టుబడి..

వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం(1998-99)లో నితీశ్ రైల్వే, ఉపరితల రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. అయితే, డాయిసాల్ రైలు ప్రమాద ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ గద్దెనెక్కిన ఎన్‌డీఏ ప్రభుత్వం(2001-2004)లో కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. సోషలిస్టు ఐడియాలజీ కలిగిన నితీశ్.. బీజేపీతో కలిసున్నప్పటికీ తనదైన పంథాను అనుసరించేవారు. గుజరాత్ లో గోద్రా మారణకాండకు బాధ్యుడు మోదీనే అని తిట్టిపోసిన నితీశ్.. 2014లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మోదీని ఎంపిక చేయడంపై బాహాటంగా విమర్శలు చేశారు. తర్వాతి కాలంలో ఎన్డీఏ నుంచి బయటికొచ్చేసి, ఆగర్భశత్రువు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపి, 2015లోమహాకూటమి ద్వారా మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఏడాదిన్నరకే విభేదాలు తలెత్తడంతో నితీశ్ మళ్లీ బీజేపీతో కలిసిపోయి సీఎంగా కొనసాగారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా నాలుగోసారి ఆయన బీహార్ సీఎం కానున్నారు.

English summary
69-year-old nitish kumar to become chief minister of Bihar once again. from engineer to earning him the sobriquet Sushasan Babu, here is how nitish impacts bihar politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X