వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల ఆరోగ్యంపై మోడీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి, 'మోడీ కేర్' పొందాలంటే ఎలా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారత ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి పలు కార్యక్రమాలను చేపట్టింది. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ద్వారా దేశంలోని ఎక్కువ మంది ప్రజలను హెల్త్ ఇన్సురెన్స్ పరిధిలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ స్కీం కానుంది.

మనపై తగ్గిన భారం, ప్రభుత్వానికి రెవెన్యూ: జీఎస్టీ వల్ల సామాన్యునికి ఎలా లాభం కలిగింది?మనపై తగ్గిన భారం, ప్రభుత్వానికి రెవెన్యూ: జీఎస్టీ వల్ల సామాన్యునికి ఎలా లాభం కలిగింది?

అదే మోడీ కేర్. ఈ హెల్త్ ఇన్సురెన్స్ పథకం ద్వారా భారతదేశంలోని దాదాపు 40 శాతం మంది ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత హెల్త్ ఇన్సురెన్స్ ఉండనుంది. సామాజిక, ఆర్థిక గణన ఆధారంగా దీంతో 10 కోట్లకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

 From Modicare to Indradhanush, NDA govt committed to ensuring affordable healthcare for all

అంతేకాదు, మోడీ ప్రభుత్వం వ్యాధి నిరోదక శక్తి పైన విస్తృత ప్రచారం చేస్తోంది. మిషన్ ఇంద్రధనుష్ ద్వారా 528 జిల్లాల్లో 3.15 కోట్లకు పైగా చిన్నారులకు, 80 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు టీకాలు ఇచ్చారు.

మోడీ ప్రభుత్వం ఇటీవలే ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించింది. ఇది జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం. సమాజంలోని అన్ని వర్గాలకు ఆరోగ్య సంరక్షణ చేరాలనేదే ఆయుష్మాన్ భారత్ ప్రయత్నం. తద్వారా దాదాపు 50 కోట్ల మందికి ఈ పరిధిలోకి రానున్నారు.

మోడీ కేర్

- ఈ ఆరోగ్య పథకం కిందకు రావడానికి కుటుంబం పరిమితి, వయస్సు, మహిళలు, పురుషులు అనే నిబంధనలు ఏవీ లేవు. కుటుంబంలోని అందరికీ వర్తిస్తుంది.
- ఎస్ఈసీసీ డాటా బేస్ ప్రకారం అర్హులైన అన్ని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.
- ఈ ఆరోగ్య పథకం కిందకు వచ్చేవారు ఆసుపత్రిలో డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.
- ఆసుపత్రిలో జాయిన్ కావడానికి ముందు నుంచి ఆ తర్వాత కూడా ఈ హెల్త్ స్కీమ్ కవర్ అవుతుంది.
- మీరు దేశవ్యాప్తంగా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా లేదా ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లినా ఉచితంగా వైద్య చికిత్స పొందవచ్చు.
- ఆసుపత్రిలో ఉచిత చికిత్స కోసం ఇందుకు సంబంధించిన ఐడీ కార్డును తీసుకు వెళ్లవలసి ఉంటుంది.

English summary
Prime Minister Narendra Modi-led NDA government has taken several initiatives to radically transform the healthcare system in India. The Modi government is trying to bring more people under health insurance cover with the National Health Protection Mission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X