చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిటైర్మెంట్‌లోనూ రికార్డు సృష్టించిన జస్టిస్ కర్ణన్

వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ తన రిటైర్మెంట్‌లోనూ రికార్డు సృష్టించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే శిక్షలు విధించి, ఆపై కోర్టు ధిక్కరణ నేరానికి సుప్రీంకోర్టు 6నెలల జైలుశిక్ష .

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ తన రిటైర్మెంట్‌లోనూ రికార్డు సృష్టించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే శిక్షలు విధించి, ఆపై కోర్టు ధిక్కరణ నేరానికి సుప్రీంకోర్టు 6నెలల జైలుశిక్ష విధించడంతో పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న జస్టిస్ సిఎస్ కర్ణన్ రిటైర్మెంట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

కాగా, సోమవారం ఆయన కోల్‌కతా హైకోర్టు జడ్జిగా రిటైరయ్యారు. కర్ణన్ అందుబాటులో లేకపోవడం వల్ల రిటైరవుతున్న జడ్జీ కోసం హైకోర్టు అధికారులు సాంప్రదాయం ప్రకారం ఇచ్చే వీడ్కోలు కార్యక్రమం జరగలేదని కోల్‌కతా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుగతో మజుందార్ చెప్పారు. ఇలా ఓ న్యాయమూర్తి విషయంలో జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

 From retiring on the run, here are the other firsts of Justice C S Karnan

రిటైర్ అయ్యాక కర్ణన్‌కు చెల్లించాల్సిన బకాయిల గురించి అడగ్గా, చట్టప్రకారం అన్ని లాంఛనాలు పూర్తి చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రిటైరవుతున్న జడ్జీకి లాయర్లు (బార్ అసోసియేషన్) కూడా వీడ్కోలు ఇవ్వడం సాంప్రదాయం. జస్టిస్ కర్ణన్ గనుక ఇక్కడ ఉండి ఉంటే బార్ అసోసియేషన్ కూడా ఆయనకు వీడ్కోలు ఇచ్చే విషయాన్ని పరిశీలించేదని, అయితే ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తమకు తెలియనందున ఆ ప్రశ్నే ఉత్పన్నం కాలేదని అదనపు అడ్వకేట్ జనరల్ అభ్రతోష్ చౌదరి తెలిపారు.

కోర్టు ధిక్కరణ నేరం కింద ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గత మే 9న జస్టిస్ కర్ణన్‌కు ఆరునెలల జైలుశిక్ష విధిస్తూ ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ పోలీసులను ఆదేశించడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎక్కడికో వెళ్లిపోయారు. కాగా, కర్ణన్ చెన్నైలోనే ఉన్నారని వార్తలు రావడంతో కోల్‌కతా నుంచి వచ్చిన పోలీసు బృందం దాదాపు నెల రోజులుగా చెన్నైలో మకాం వేసింది. కానీ, కర్ణన్ జాడ కనిపెట్టలేకపోయింది.

English summary
Justice C S Karnan earned a dubious distinction when he became the first judge to retire on the run. He is facing arrest in a contempt case. On May 9 a seven judge Bench of the Supreme Court issued an unprecedented arrest order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X