వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టార్ డమ్ నుంచి రాజకీయాల వరకు: రెండింటా అంబరీష్ సక్సెస్, 2009లో ఓటమి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నటుడు, రాజకీయ నేత అంబరీష్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో శనివారం రాత్రి బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మాండ్య జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది మృతి చెందిన విషయం తెలుసుకొని ఆవేదన చెందారు. తనకు అనారోగ్యంగా ఉందని, శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉందని లేదంటే బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లేవాడినని చెప్పారు.

Recommended Video

Ambareesh : అంబరీష్ చివరి చూపుకోసం తరలి వస్తున్న సినీ రాజకీయ ప్రముఖులు | Oneindia Telugu

రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆయన ఆరోగ్య సమస్య ఎక్కువయింది. దీంతో జేపీ నగరలోని ఆయన ఇంటి నుంచి విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందించారు. రాత్రి పది గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. బహుభాషా నటి సుమలత ఆయన భార్య. వీరికి అభిషేక్‌ ఒక్కడే కుమారుడు. సుమలతను 1991లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

కేంద్రమంత్రిగా అంబరీష్

కేంద్రమంత్రిగా అంబరీష్

అంబరీష్ నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. తొలిసారి 12వ లోకసభలోకి ఎంపీగా ప్రవేశించారు. అనంతరం 13, 14వ లోకసభల్లోనూ సభ్యునిగా ఉన్నారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. అంబరీష్ 200కు పైగా సినిమాల్లో నటించారు. అతని చివరి సినిమా అంబి నింగ్ వయసాయింతో.

మాండ్య నుంచి మూడుసార్లు

మాండ్య నుంచి మూడుసార్లు

అంబరీష్ 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వని సమయంలో ఆయన జనతా దళ్ పార్టీలో చేరారు. 1998లో మాండ్య నుంచి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. ఆ తర్వాత తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాండ్య నుంచి మూడుసార్లు లోకసభకు వెళ్లారు. 12వ లోకసభ 1998 నుంచి 1999, 13వ లోకసభ 1999 నుంచి 2004 వరకు, 14వ లోకసభ 2004 నుంచి 2009 వరకు ఎంపీగా పని చేశారు. 2006 నుంచి 2008 వరకు కేంద్ర సహాయమంత్రిగా ఉన్నారు.

కర్ణాటక కాంగ్రెస్ డిప్యూటీ ప్రెసిడెంట్

కర్ణాటక కాంగ్రెస్ డిప్యూటీ ప్రెసిడెంట్

2012లో ఆయన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కర్ణాటక మంత్రిగా పని చేశారు. కావేరీ నీటి వివాదం విషయంలో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో 2013 నుంచి 2016 వరకు ఆయన హౌసింగ్ మంత్రిగా ఉన్నారు.

ఎన్నో అవార్డులు

ఎన్నో అవార్డులు

2009 లోకసభ ఎన్నికల్లో ఆయన మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. 2013లో ధార్వాడ్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ఇచ్చింది. నటుడిగా ఆయన ఎన్నో రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. తన సినిమా కెరీర్లోను ఎన్నో అవార్డులు అందుకున్నారు. అంబరీష్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

English summary
Legendary Kannada actor and former Union Minister M.H. Ambareesh, 66, passed away in a private hospital here late on Saturday night following cardiac arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X