వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోగం తగ్గలేదని డాక్టర్ భార్యను పొడిచి చంపిన పేషెంట్..

|
Google Oneindia TeluguNews

ఇండోర్ : అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లడం సాధారణం. వారిచ్చే ట్రీట్‌మెంట్ ఒక్కో పేషెంట్‌పై ఒక్కోలా పనిచేస్తుంది. కొందరికి రోజుల్లోనే వ్యాధి నయమైతే.. మరికొందరికి తగ్గకపోవచ్చు. అలాంటప్పుడు మరో డాక్టర్ దగ్గరకు వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకుంటారు. అయితే మధ్యప్రదేశ్ ఇండోర్‌లో మాత్రం ఓ పేషెంట్ రోగం తగ్గలేదన్న కారణంతో డాక్టర్‌పై పగ పెంచుకున్నాడు. ఆయన భార్యను కసితీరా పొడిచి చంపాడు.

ఓరి ఈడి ఏషాలో : పగలు టిక్‌టాక్ వీడియోలు.. రాత్రికి...ఓరి ఈడి ఏషాలో : పగలు టిక్‌టాక్ వీడియోలు.. రాత్రికి...

చర్మ వ్యాధి సోకడంతో

చర్మ వ్యాధి సోకడంతో

ఇండోర్‌కు చెందిన రఫీక్ రషీద్ కొంతకాలంగా చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. దురదతో ఇబ్బంది పడుతున్న అతను మాల్వా మిల్స్ ప్రాంతంలో ఓ ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ రామకృష్ణ వర్మ వద్దకు వెళ్లాడు. ఆరు నెలలుగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. అయితే డాక్టర్ చెప్పినట్లుగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా ఆయన రోగం తగ్గడంలేదు. ఈ విషయాన్ని డాక్టర్ వద్ద ఎన్నిసార్లు ప్రస్తావించినా తగ్గుతుందన్న సమాధానమే చెప్పాడు. దురద మరింత పెరగడంతో రఫీక్ గురువారం ఉదయం 11గంటల సమయంలో క్లీనిక్‌కు వెళ్లాడు.

డాక్టర్ భార్యతో వాగ్వాదం

డాక్టర్ భార్యతో వాగ్వాదం


క్లీనిక్‌కు వెళ్లిన రఫీక్‌కు డాక్టర్ వర్మ భార్య లత ఎదురైంది. తన భర్త పని మీద ఢిల్లీకి వెళ్లాడని చెప్పింది. ఆరు నెలలుగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా వ్యాధి తగ్గకపోవడంపై ఫస్ట్రేషన్‌లో ఉన్న రఫీక్ డాక్టర్ భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన.. వెంట తీసుకెళ్లిన కత్తితో లతను దారుణంగా పొడిచాడు. తల్లి అరుపులు విని బయటకు వచ్చిన కొడుకుపై కూడా కత్తితో దాడి చేసిన రఫీక్ ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు.

తల్లి మృతి, కొడుకు పరిస్థితి విషమం

తల్లి మృతి, కొడుకు పరిస్థితి విషమం

డాక్టర్ భార్య, కొడుకు అరుపులు విని ఇరుగుపొరుగు వారు బయటకు వచ్చారు. అక్కడ జరిగిన దారుణం చూసి వెంటనే అప్రమత్తమయ్యారు. కత్తితో దాడి చేసి పారిపోతున్న రఫీక్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లీ కొడుకులను హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే లత మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. తీవ్ర గాయాలపాలైన కొడుకు అభిషేక్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు.

నిందితుడిపై గతంలో మర్డర్ కేసు

నిందితుడిపై గతంలో మర్డర్ కేసు

డాక్టర్ భార్య హత్య, కొడుకుపై దాడికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు ముందు నిందితుడు మృతురాలిపై లైంగిక దాడికి ప్రయత్నించాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 2015లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడైన రఫీక్‌ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నడని పోలీసులు చెప్పారు.

English summary
Frustrated with doctor, who wasn’t able to cure his itch for six months, an Indore man stabbed to death the doctor’s wife and injured her son. the incident happened at the clinic of Dr Ramakrishna Verma in the Malwa Mills area of Indore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X