వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బర్డ్ ప్లూ టెన్షన్: సగం ఉడికిన గుడ్డు, మాంసం మాత్రం తినొద్దు.. కేంద్రం మార్గదర్శకాలు

|
Google Oneindia TeluguNews

బర్డ్ ఫ్లూ మహమ్మారి విస్తరణ నేపథ్యంలో హై టెన్షన్ నెలకొంది. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు విడుదల చేసింది. బర్ద్ ఫ్లూ వైరస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 3 సెకన్లలో చనిపోతుందని వెల్లడించింది. మాంసం, గుడ్లు 74 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడికించితే వైరస్ చనిపోతుందని స్పష్టం చేసింది.

Recommended Video

Bird Flu : Delhi, Maharashtra లో బర్డ్ ఫ్లూ భయం ! || Oneindia Telugu

కోళ్లు/ ఆధారిత రంగానికి సంబంధించిన ఉత్పత్తులపై ఆధారపడ్డ వ్యాపారవేత్తలు, వినియోగదారులు భయపడొద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ స్పష్టంచేసింది. వ్యాపారవేత్తలు, వినియోగదారులు ఏం చేయాలో.. ఏమి చేయకూడదనే అంశంపై మార్గదర్శకాలలో వివరించింది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు, అపోహలను తొలగించేందుకు ఏమి చేయాలో.. ఏమీ చేయకూడదో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ సవివరంగా తెలియజేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వైద్య బృందాలతో టాస్క్ ఫోర్స్ కమిటీలను వేసి.. కోళ్ల ఫారాలు.. ఇతర పక్షి, జంతు కేంద్రాలను పశు వైద్య నిపుణులు తనిఖీ చేస్తున్న నేపధ్యంలో మార్గదర్శకాలు విడుదల చేశారు.

fssai release bird flu guidelines

చికెన్ వంట చేసే సమయంలో మధ్యలో తినకూడదని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో పక్షులతో దగ్గరగా ఉండొద్దని తెలిపింది. చనిపోయిన పక్షులను చేతులతో తాకవద్దని కోరింది. పచ్చి మాంసాన్ని ఖాళీ ప్రదేశంలో ఉంచొద్దని.. ప్రత్యక్షంగా తాకవద్దని వివరించింది. పచ్చి చికెన్ ను ముట్టుకునే సమయంలో మాస్కు, గ్లౌజు తప్పనిసరిగా ధరించాలని కోరింది. పచ్చి మాంసం ఉంచే ప్రదేశాలు, సమీప ప్రదేశాలను కూడా శుభ్రంగా ఉంచాలని స్పష్టంచేసింది. పూర్తిగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లు మాత్రమే తీసుకోవాలని వెల్లడించింది.

English summary
food safety and standards authority of india release bird flu guidelines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X