వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్ ధరలపై బీజేపీ, కాంగ్రెస్ గ్రాఫ్ యుద్ధం: నెటిజన్ల విమర్శలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విపక్షాలు సోమవారం భారత్ బంద్ నిర్వహించాయి. అయితే మన్మోహన్ సింగ్ హయాంలో పెట్రోల్ ధరలు బాగా పెరిగాయని పలువురు గుర్తు చేస్తున్నారు.

అంతేకాకుండా చమురు కోసం మన్మోహన్ హయాంలో చేసిన అప్పును మోడీ హయాంలో తీర్చారు. అయినప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

భారత్ బంద్ కారణంగా రెండేళ్ల చిన్నారి మృతి, మీరేం చెబుతారు: రాహుల్‌కు కేంద్రమంత్రిభారత్ బంద్ కారణంగా రెండేళ్ల చిన్నారి మృతి, మీరేం చెబుతారు: రాహుల్‌కు కేంద్రమంత్రి

పెట్రోల్ ధరల్లో వాస్తవం అంటూ బీజేపీ ట్వీట్

2004లో, 2009లో, 2014లో, 2018లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయంటూ బీజేపీ ట్వీట్ చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలలో అసలు విషయం ఇదీ అంటూ ఈ ట్వీట్ ఉంది. దీని ప్రకారం డీజిల్ ధర వాజపేయి హయాం ముగిసే నాటికి అంటే 16 మే 2004లో రూ.21.74 పైసలు ఉందని పేర్కొంది.

 పెట్రోల్ ధరలు ఇలా పెరిగాయి.. బీజేపీ

పెట్రోల్ ధరలు ఇలా పెరిగాయి.. బీజేపీ

ఆ తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలో 16 మే 2009 నాటికి 30.86కు చేరుకుందని, 16 మే 2014లో మోడీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.56.71 పైసలు ఉందని బీజేపీ పేర్కొంది. ఇప్పుడు 10 సెప్టెంబర్ 2018లో మోడీ హయాంలో డీజిల్ 72.83గా ఉందని పేర్కొంది. మన్మోహన్ తొలిసారి ప్రధానిగా ఉన్నప్పుడు 42 శాతం పెరిగిందని, రెండోసారి ప్రధానిగా ఉన్నప్పుడు 83.7 శాతం పెరిగిందని పేర్కొన్నారు.

కౌంటరిచ్చిన కాంగ్రెస్

దీనికి కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. అసలు నిజం ఇదీ అంటు మరో పోస్ట్ పెట్టింది. ఈ పద్నాలుగేళ్ల కాలంలో పెరిగిన పెట్రోల్ ధరలను, బ్యారెల్ ధరలను పేర్కొంది.

 పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు

కాగా, బీజేపీ, కాంగ్రెస్ చేసిన ట్వీట్లపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. నెటిజన్లు కూడా అప్పుడు ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో గ్రాఫ్‌లు పోస్ట్ చేస్తున్నారు. యూపీఏ, ఏన్డీయే హయాంలో డీజిల్ ధర, పెట్రోల్ ధరలు అంటూ పోస్టులు పెడుతున్నారు.

English summary
The BJP government on Monday came up with what could be termed a bizarre calculus to defend the Narendra Modi government against the opposition attack on fuel price hike. The official Twitter handle of the ruling party came up with a series of tweets with graphs explaining the “Truth of hike in petroleum prices”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X