చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ ఏడాది చివరి రోజున రికార్డు స్థాయిలో తగ్గిన పెట్రోలు ధరలు

|
Google Oneindia TeluguNews

ఈ ఏడాది నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన పెట్రోలు ధరలు చివరి రోజున అంటే డిసెంబర్ 31న అతి తక్కువ స్థాయికి పడిపోయాయి. 2018 మొత్తం ఇలా పడిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. మొత్తం నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోలు ధరలు తగ్గిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 68.84కు చేరుకుంది. ఆదివారం రోజున ఢిల్లీలో ఈ ధర రూ. 69.04 ఉన్నింది.

ఇక కోల్‌కతా, ముంబై, చెన్నైలలో లీటరు పెట్రోలు ధర వరుసగా రూ.70.96, రూ. 74.47, రూ.71.41గా ఉన్నాయి. అంతకుముందు అంటే ఆదివారం రోజున ఈ ధరలు ఈ ప్రధాన నగరాల్లో రూ. 71.15, రూ. 74.67 ,రూ. 71.62గా ఉన్నట్లు ఆయిల్ కార్పోరేషన్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడిచమురు ధరలు పడిపోవడంతోనే దేశంలో పెట్రోల్ ధరలు దిగివచ్చాయని నిపుణులు చెప్పారు. దేశంలోని ఇంధన ధరలు అంతర్జాతీయ ఇంధన ధరలు, రూపాయి విలువపై ఆధారపడి ఉంటాయి.

Fuel Rates Touch New Low For 2018, Petrol Below Rs. 69-Mark In Delhi

ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఇంధన ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇందుకు కారణం చమురు ఉత్పత్తి దేశాలు, ఇతర దేశాలపై చమురు ఉత్పత్తిపై విధించిన ఆంక్షలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇది కచ్చితంగా ఇంధన ధరలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పెట్రోల్ ధరలతో పాటుగానే డీజిల్ ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై నగరాల్లో లీటరు పెట్లోలు ధర వరుసగా రూ. 62.86, రూ. 64.61, రూ.65.76, రూ.66.35 ఉన్నాయి.

English summary
Petrol prices on Monday declined to their lowest levels of 2018 across the four metro cities, with the fuel being sold at Rs. 68.84 per litre in the national capital.On Sunday it was priced at Rs. 69.04 in Delhi, according to the Indian Oil Corp's website.In Kolkata, Mumbai and Chennai, the petrol prices fell to fresh lows of the year, at Rs. 70.96, Rs. 74.47 and Rs. 71.41 respectively, down from Rs. 71.15, Rs. 74.67 and Rs. 71.62 per litre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X