• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సి మిస్సింగ్: సముద్ర తీరంలో కనిపించిన కారు

|

ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. అనుమానాస్పద స్థితిలో అదృశ్యం అయ్యారు. ఆయన కనిపించట్లేదంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మేహుల్ చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ధృవీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ- ఆయన ఆచూకీ తెలియరాలేదు. ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం జాలీ హార్బర్ సమీపంలో ఆయన కారు మాత్రమే వారికి కనిపించింది. ఆ కారు ఆయనదేనని కుటుంబ సభ్యులు నిర్ధారించారు.

ఆంటిగ్వాలో నివాసం..

ఆంటిగ్వాలో నివాసం..

మేహుల్ చోక్సీ, ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం ద్వీపదేశం ఆంటిగ్వా అండ్ బార్బడోస్‌లో నివసిస్తోన్నారు. వారికి ఆ దేశ పౌరసత్వం ఉంది. అంటిగ్వా పశ్చిమ తీర ప్రాంతంలోని రిసార్ట్ విలేజ్ జాలీ హార్బర్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో భోజనం చేయడానికంటూ తన కారులో బయలుదేరిన చోక్సీ.. ఇక మళ్లీ తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చోక్సీ తరచూ వెళ్లే రెస్టారెంట్ అది. ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లిన తరువాత.. ఆయన మొబైల్ స్విచాఫ్ అయిందని, గంటలు గడుస్తున్నప్పటికీ ఆయన తిరిగి రాలేదని చోక్సీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ధృవీకరించిన అడ్వొకేట్..

ధృవీకరించిన అడ్వొకేట్..

మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకున్నపోలీసులు ఆయన కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నట్లు అక్కడి మీడియా ఆంటిగ్వాన్ న్యూస్‌రూమ్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని ముంబైలో నివసిస్తోన్న చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ ధృవీకరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే ఈ విషయాన్ని చోక్సీ కుటుంబ సభ్యులు తనకు ఫోన్ ద్వారా తెలియజేశారని, పోలీసులతో తాను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానని అన్నారు. జాలీ హార్బర్ సముద్ర తీరంలో ఆయన కారు మాత్రమే కనిపించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.

గీతాంజలి గ్రూప్ అధినేతగా..

గీతాంజలి గ్రూప్ అధినేతగా..

గుజరాత్‌కు చెందిన మేహుల్ చోక్సీ వజ్రాల వ్యాపారి. గీతాంజలి గ్రూప్ పేరుతో దేశవ్యాప్తంగా నాలుగు వేల వరకు చైన్ షాప్స్ ఉన్నాయి. బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంచ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లల్లో లిస్టెడ్ కంపెనీ అది. ఈ కంపెనీ పేరు మీద పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వేల కోట్ల రూపాయల మేర రుణాలను తీసుకున్నారు. వాటిని చెల్లించలేదు. ఇదే కేసు కింద బ్రిటన్‌కు పారిపోయిన మరో ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోడీకి మేహుల్ చోక్సీ దగ్గరి బంధువు. చోక్సీ స్వదేశానికి రప్పించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తమవంతు ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.

  Arogya Sri వల్ల రోజూ 25000 మందికి Covid చికిత్స జరుగుతుంది - Ys Jagan || Oneindia Telugu
  అన్ని కోణాల్లో దర్యాప్తు..

  అన్ని కోణాల్లో దర్యాప్తు..

  తనను స్వదేశానికి పంపించడానికి చేస్తోన్న ప్రయత్నాలను ఆయన అడ్డుకుంటున్నారు. దీనికోసం న్యాయపరమైన ప్రయత్నాలు చేస్తోన్నారు. చోక్సీని స్వదేశానికి అప్పగించడంపై ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటనలు కూడా చేయలేదు. ఈ పరిస్థితుల్లో చోక్సీ అనుమానాస్పదంగా అదృశ్యం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. సముద్ర తీరంలో కారు మాత్రమే లభించడం పట్ల ఆయన ఏమైపోయి ఉంటారనేది అంతుచిక్కట్లేదు. అక్కడి పోలీసులు పలు కోణాల్లో తమ దర్యాప్తును సాగిస్తోన్నారు. కుటుంబ సభ్యులను విచారించినట్లు తెలుస్తోంది.

  English summary
  Fugitive diamantaire Mehul Choksi, who is wanted by the Central Bureau of Investigation (CBI) and Enforcement Directorate (ED), has gone missing in Antigua and Barbuda.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X