వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమార స‌ర్కార్‌కు ప‌ద‌వీ గండం? విప్ జారీ చేసినా తిరుగుబాటు ఎమ్మెల్యేల గైర్హాజ‌ర్‌! జాబితా ఇదే!

|
Google Oneindia TeluguNews

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి సార‌థ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) కూట‌మి ప్ర‌భుత్వానికి ప‌ద‌వీ గండం త‌ప్పేట్లు లేదు. స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ విప్ జారీ చేసిన‌ప్ప‌టికీ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు స‌భ‌కు హాజ‌రు కాలేదు. ఇదివ‌ర‌కే రాజీనామా చేసిన మొత్తం 18 మంది ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టారు. వారి రాజీనామాల‌ను స్పీక‌ర్ ఇంకా ఆమోదించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ- బ‌ల‌ప‌రీక్ష సంద‌ర్భంగా కుమార‌స్వామి ప్ర‌భుత్వం మైనారిటీలో ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

మిస్సింగ్ ఎమ్మెల్యే: రాత్రి బెంగ‌ళూరులో మాయం..ముంబై ఆసుప‌త్రిలో గుండెనొప్పితో ప్ర‌త్య‌క్షం!మిస్సింగ్ ఎమ్మెల్యే: రాత్రి బెంగ‌ళూరులో మాయం..ముంబై ఆసుప‌త్రిలో గుండెనొప్పితో ప్ర‌త్య‌క్షం!

18 మంది వీళ్లే..
కాంగ్రెస్‌కు చెందిన 18 తిరుగుబాటు ఎమ్మెల్యేలు బ‌ల‌ప‌రీక్ష‌కు దూరంగా ఉన్నారు. ఎస్‌టీ సోమ‌శేఖ‌ర్ (య‌శ్వంత‌పుర‌), బైర‌తి బ‌స‌వ‌రాజు (కృష్ణ‌రాజపురం), ర‌మేష్ జార్కిహోళి (గోకక్‌), మునిర‌త్న (రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర‌), రోష‌న్ బేగ్ (శివాజీ న‌గ‌ర‌), హెచ్ విశ్వ‌నాథ్ (హుణ‌సూరు), మహేష్ కుమ‌ట‌హ‌ళ్లి (అథ‌ణి), ప్ర‌తాప్ గౌడ పాటిల్ (మ‌స్కి), కె సుధాక‌ర్ (చిక్‌బ‌ళ్లాపుర‌), శివ‌రామ్ హెబ్బార్ (ఎల్లాపూర్‌), శ్రీమంత్ పాటిల్ (క‌గ్వాడ‌), ఎంటీబీ నాగ‌రాజ్ (హొసకోటె), నారాయ‌ణ గౌడ (కృష్ణ‌రాజ పెటే), గోపాల‌య్య (మ‌హాల‌క్ష్మి లేఅవుట్‌), బీసీ పాటిల్ (హిరెకెరూర్‌), ఆనంద్ సింగ్ (విజ‌య‌న‌గ‌ర‌), బీ నాగేంద్ర, ఆర్ శంక‌ర్ (ముళ‌బాగిలు)..వీరంతా అసెంబ్లీలోని ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న బ‌ల‌ప‌రీక్ష‌కు దూరంగా ఉన్నారు.

full list of Rebel MLAs skipped the assembly for floor test in Karnataka

విప్ జారీ చేసినా..
కుమార‌స్వామి ప్ర‌భుత్వం త‌న బ‌లాన్ని నిరూపించుకోవ‌డానికి ఏర్పాటు చేసిన శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు ఏకంగా 18 మంది గైర్హాజ‌రు కావ‌డంతో సంకీర్ణ స‌ర్కార్ ఇబ్బందుల్లో ప‌డింద‌నే అంటున్నారు. వారంతా రాజీనామా చేసిన వారే. వారిలో ఏ ఒక్కరి రాజీనామా కూడా ఆమోదం పొంద‌లేదు. ఈ నేప‌థ్యంలో- ఆయా ఎమ్మెల్యేలంతా ప్ర‌స్తుతం స‌భ్యులుగా కొన‌సాగుతున్న వారే. దీనితో స్పీక‌ర్ ర‌మేష్‌కుమార్ విప్ జారీ చేశారు. కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మిలో ప్ర‌స్తుతం ఉన్న 116 మంది స‌భ్యులకూ విప్ వర్తిస్తుంది.

English summary
Karnataka Chief Minister HD Kumaraswamy and Congress leader Siddaramaiah addressed the Assembly amid uproar ahead of the floor test on Thursday, 18 July. Meanwhile, Speaker Ramesh Kumar allows for whip to be applied on all MLAs, including rebel MLAs, in the Karnataka Assembly. The Congress-Janata Dal (Secular) government is hanging by a thread with the rebel MLAs refusing to yield after the Supreme Court held they cannot be compelled to attend the Assembly session to decide the ruling coalition's fate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X