వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

G7 summit: జర్మనీలో ప్రధాని మోడీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..కౌంటర్ టెర్రరిజం

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు ఇవ్వాళ ప్రారంభం కానుంది. జర్మనీ దక్షిణ ప్రాంతంలోని బవారియన్ ఆల్ప్స్ రీజియన్‌లో గల ఎల్మావ్ క్యాజిల్ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఈ సమ్మిట్ మొదలు కానుంది. రెండు రోజుల కొనసాగుతుంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్ దీనికి అధ్యక్షత వహిస్తారు. ఉగ్రవాదం, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ, వాతావరణ మార్పులు, పర్యావరణం.. వంటి కీలక అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి. అనంతరం జీ7 దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆమోదిస్తాయి.

భారత్‌తో పాటు అర్జెంటీనా, ఇండొనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికాలను కూడా జర్మనీ ఆహ్వానించింది. ఇందులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి కిందటే జర్మనీ చేరుకున్నారు. మ్యూనిచ్‌లో ల్యాండ్ అయ్యారు. విమానాశ్రయంలో ఆయనకు సాదర స్వాగతం లభించింది. బవారియన్ బ్యాండ్ ఆయనకు ఘన స్వాగతం పలికింది. జర్మనీలోని భారతీయులను మోడీ కలుసుకున్నారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు.

G7 summit: PM Modi arrives in Germany for two-day visit

అక్కడి నుంచి నేరుగా ఎల్మావ్ క్యాజిల్ హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం అంశం కూడా జీ7 సమ్మిట్‌లో ప్రత్యేకంగా చర్చకు రానుంది. యుద్ధం మొదలైన అనంతరం తలెత్తిన ఆహారం-ఇంధన కొరత, రష్యాపై యూరోపియన్ యూనియన్ దేశాలు విధించిన ఆంక్షల వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తాజా పరిణామాలపైనా జీ7 దేశాధినేతలు, ప్రధానమంత్రులు చర్చించనున్నారు.

యుద్ధాన్ని నివారించేలా ప్రత్యేకంగా ఓ తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. జీ7 సమ్మిట్ ముగిసిన తరువాత ప్రవాస భారతీయులను ప్రధాని కలుసుకుంటారు. అనంతరం 28వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయలుదేరి వెళ్తారు. కిందటి నెల 28వ తేదీన కన్నుమూసిన షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్‌కు నివాళి అర్పిస్తారు. ఆ దేశ ప్రధానమంత్రి మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తోమ్‌ను కలుసుకుంటారు.

English summary
Prime Minister Narendra Modi on Sunday arrived here on a two-day visit to Germany during which he will attend the G7 summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X