వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గడ్చిరౌలీలో పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన గిరిజనులు.. మావోయిస్టుల ఆదేశాలు బేఖాతరు

|
Google Oneindia TeluguNews

మావోయిస్టులు ఆదేశించారు.. పౌరులు బేఖాతారు చేశారు. అవును మహారాష్ట్ర గడ్చిరౌలిలో ఓటు వేయొద్దని గిరిజనులకు మవోయిస్టులు హుకుం జారీచేశారు. కానీ వారు మాత్రం పట్టించుకోలేదు. తమ ఓటుహక్కును వినియోగించుకొని మిగతావారికి ఆదర్శంగా నిలిచారు. గిరిజనులకు ఓటు హక్కుపై కలెక్టర్, ఎస్పీ అవగాహన కల్పించారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పడంతో.. విలువ తెలుసుకొని గిరిజనులు తమ ఓటు వేశారు.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ, హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ, హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్

మహారాష్ట్రలోని గడ్చిరౌలీ జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. సోమవారం జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయొద్దని హుకుం జారీచేశారు. దీంతో గడ్చిరౌలీలో ఓటింగ్ ఎలా ఉంటుందనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో స్థానికులు మావోయిస్టుల ఆదేశాలను బేఖాతరు చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Gadchiroli tribals cast their votes despite Maoists threat

పోలింగ్ కేంద్రాలకు వచ్చి మరీ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు బ్యానర్లు పెట్టినా, కరపత్రాలు పంచి ఆందోళనకు గురిచేశారు. కానీ స్థానికులు మాత్రం ఓటు హక్కు వినియోగించుకునేందుకే మొగ్గుచూపారు. ముఖ్యంగా గడ్చిరౌలి జిల్లా కలెక్టర్, పోలీసు బాస్.. ఓటింగ్ పెరిగేందుకు విశేషంగా కృషిచేశారు. ఓటు హక్కుపై గిరిజనులకు అవగాహన కల్పించి..ఓటు వేయాలని స్పష్టంచేశారు. వారిని పోలింగ్ బూత్ వద్దకు తీసుకొచ్చి.. ఓటు వేసేలా చైతన్యపరిచారు. మరోవైపు మహారాష్ట్ర, హర్యానాలో పోలింగ్ మందకొడిగా సాగింది. హర్యానాలో 60 శాతం వరకు పోలింగ్ జరిగినట్టు ప్రాథమికంగా తెలిసింది. మహారాష్ట్రలో అయితే 50 నుంచి 60 శాతం పోలింగ్ జరిగినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

English summary
Tribals from the interior villages of Gadchiroli district in Maharashtra on Monday exercised their votes and participated in the election process despite threats by the Maoists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X