• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైఎస్ జగన్ ఆశయాన్ని నెరవేర్చిన బీజేపీ సర్కార్: ఆ రాష్ట్రంలో ఇక రెండు రాజధానులు: గెజిట్

|

డెహ్రాడూన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతకు, ముందచూపునకు ఉదాహరణగా నిలిచే ఉదంతం ఇది. ఒక రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమాన అవకాశాలను దక్కించుకోవాల్సి ఉంటుందనేది వైఎస్ జగన్ ఆశయం. అందుకే ఆయన రాష్ట్రంలో మూడు రాజధానులను నెలకొల్పడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. అన్నీ సవ్యంగా సాగివుంటే.. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా కొనసాగి ఉంటే.. ఈ పాటికి విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఆవిర్భవించి ఉండేది.

  Gairsain Declared Summer Capital Of Uttarakhand

  శ్రీవారి ఆస్తులపై టీటీడీ ఛైర్మన్ మరో కామెంట్: ఆ దిశగా కసరత్తు చేస్తున్నామంటూ: అన్ని వివరాలూ

  జగన్ ఆశయాన్ని నెరవేర్చిన బీజేపీ ప్రభుత్వం..

  జగన్ ఆశయాన్ని నెరవేర్చిన బీజేపీ ప్రభుత్వం..

  ఉత్తరాంధ్రలోని సాగర నగరం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా.. కోస్తా ప్రాంతంలోని అమరావతిని చట్టసభల రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా మార్చాలని ప్రతిపాదించారు. దీనికోసం వికేంద్రీకరణ బిల్లును సైతం తెచ్చారు. అది కాస్తా న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుంది. ఫలితంగా- మూడు రాజధానుల ఏర్పాటులో మరింత జాప్యం ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది. ఇదలావుంచితే- వైఎస్ జగన్ ఆశయాన్ని నెరవేర్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.

  ఉత్తరాఖండ్‌లో ఇక రెండు రాజధానులు..

  ఉత్తరాఖండ్‌లో ఇక రెండు రాజధానులు..

  బీజేపీ అధికారంలో ఉన్న దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఇక రెండు రాజధానులు ఏర్పాటు అయ్యాయి. అత్యంత వెనుకబడిన, పర్వత పంక్తులతో కూడిన గైర్‌సైన్ పట్టణాన్ని వేసవి రాజధానిగా ప్రకటించింది అక్కడి బీజేపీ ప్రభుత్వం. చమోలీ జిల్లా కేంద్రం ఈ గైర్‌సైన్.ఈ మేరకు ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీరాణి మౌర్య సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. గైర్‌సైన్ పట్టణాన్ని వేసవి రాజధానిగా మార్చడానికి వీలుగా ప్రభుత్వం అందించిన ప్రతిపాదనలపైకొద్దిసేపటి కిందటే గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీనితో ఉత్తరాఖండ్ తొలి వేసవి రాజధానిగా గైర్‌సైన్ చరిత్ర లిఖించింది.

  నోటిఫికేషన్ విడుదల..

  నోటిఫికేషన్ విడుదల..

  గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్ కుమార్ సింగ్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. గైర్‌సైన్‌ను వేసవి రాజధానిగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 348 క్లాజ్ (3) ప్రకారం ఉత్తరాఖండ్‌లో రెండో రాజధానిని ఏర్పాటు చేశారని, తక్షణమే ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని ఉత్పల్ కుమార్ సింగ్ తెలిపారు. ఇక నుంచి వేసవి పరిపాలన గైర్‌సైన్ నుంచి కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రాజధాని డెహ్రాడూన్‌కు అదనంగా గైర్‌సైన్ రాజధానిగా కొనసాగుతుందని అన్నారు.

  ప్రజల అకాంక్షలకు అనుగుణంగా..

  ప్రజల అకాంక్షలకు అనుగుణంగా..

  ఏపీ తరహాలోనే ఉత్తరాఖండ్‌లో కూడా 13 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలు ఉన్నట్లుగానే ఉత్తరాఖండ్‌ను గర్వాల్, కుమావున్ ప్రాంతాలుగా వాటిని విభజించారు. కుమావున్ డివిజన్ పరిధిలోని చమోలీ జిల్లా కేంద్రం గైర్‌సైన్. రాజధాని డెహ్రాడూన్ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో పర్వత పంక్తుల మధ్య ఉంటుంది. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉన్న గైర్‌సైన్‌ను రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్ ఇటీవలే మొదలైంది. ఆ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి, గైర్‌సైన్‌ను వేసవి రాజధానిగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఈ ఏడాది మార్చి 4న ప్రకటించారు.

  English summary
  Dehradun, June 8 (IANS) Gairsain town in Chamoli district of Uttarakhand on Monday was officially declared as the new summer capital of the hilly state. Uttarakhand Governor Baby Rani Maurya gave her nod to the state government''s move declaring Gairsain or Bhararisen as the new summer capital of the state. The information was shared through a notification issued by the Uttarakhand Chief Secretary Utpal Kumar Singh. "The Governor is hereby pleased to give her assent for declaration of Bhararisen (Gairsain) district Chamoli as the summer capital of Uttarakhand state," the notification reads.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X