వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కార్ బాటలో మరో రాష్ట్రం: దేవభూమిలో ఇక రెండు రాజధానులు: వికేంద్రీకరణకు సై..!

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో ప్రకటించారో తెలియట్లేదు గానీ.. మరో రాష్ట్రం అదే బాటలో ప్రయాణించడానికి సిద్ధపడింది. మొన్నటికి మొన్న నాలుగు రాజధానులను ఏర్పాటు చేస్తామని జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ సర్కార్ ప్రకటించింది. తాజాగా దేవభూమిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్ కూడా వికేంద్రీకరణకు సన్నాహాలు చేస్తోంది.

వేసవి రాజధానిగా..

ఉత్తరాఖండ్‌లోని గైర్‌సైన్ నగరాన్ని రెండో రాజధానిగా ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్. వేసవి రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించారు. ప్రస్తుత రాజధానిగా డెహ్రాడూన్‌ను కొనసాగిస్తూనే దీనికి అదనంగా- గైర్‌సైన్‌ను ఉంటుందని త్రివేంద్రసింగ్ రావత్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఓ ట్వీట్ చేశారు. వేసవి రాజధానిగా గైర్‌సైన్‌ను బదలాయించడానికి అవసరమైన చర్యలను వెంటనే ప్రారంభిస్తామనీ ఆయన స్పష్టం చేశారు.

వెనుకబడిన ప్రాంతంగా..

వెనుకబడిన ప్రాంతంగా..

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉంటుందీ నగరం. ప్రస్తుత రాజధాని డెహ్రాడూన్ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో పర్వత పంక్తుల మధ్య ఉంటుంది గైర్‌సైన్. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉన్న గైర్‌సైన్‌ను రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్ ఇటీవలే మొదలైంది. క్రమంగా ఉద్యమ రూపాన్ని సంతరించకుంటోంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన త్రివేంద్రసింగ్ రావత్.. అప్రమత్తం అయ్యారు. ఆ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నానని, గైర్‌సైన్‌ను వేసవి రాజధానిగా ప్రకటిస్తున్నానని తెలిపారు.

ప్రజల కోరికలను నెరవేర్చాం: త్రివేంద్రసింగ్

చమోలీ జిల్లా ప్రాంత ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తున్నామని, తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల వైపే మొగ్గు చూపుతుందని త్రివేంద్ర సింగ్ వెల్లడించారు. ఉత్తరాఖండ్ పూర్తిగా పర్వతాలతో నిండిన రాష్ట్రమని అన్నారు. పర్వత ప్రాంతాల నడుమ ఉండే గైర్‌సైన్‌ను రాజధానిగా చూడాలనే కోరిక పహాడీ ఇలాకా ప్రజల్లో తరచూ వ్యక్తమౌతుండేదని చెప్పారు. వారి డిమాండ్లు, వారి అకాంక్షల మేరకే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని త్రివేంద్ర సింగ్ అన్నారు.

Recommended Video

3 Minutes 10 Headlines | AP Capital Shift In May | CAC Ignores Ajit Agarkar | Oneindia Telugu
 బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు..

బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు..


నిజానికి- ఉత్తరాఖండ్ బడ్జెట్ సమావేశాలు బుధవారమే ఆరంభం అయ్యాయి. ఈ సమావేశాల సందర్భంగా కూడా అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు సభ్యులు సైతం సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. గైర్‌సైన్‌లో ఉద్యమం ఊపందుకుంటోందని, ఏదో ఒక నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే త్రివేంద్ర సింగ్ రావత్.. ఈ ప్రకటన చేశారు. గైర్‌సైన్‌ను వేసవి రాజధానిగా ప్రకటించారు.

English summary
Uttarakhand Chief Minister Trivendra Singh Rawat, on Wednesday, announced in the state Assembly that Gairsain in Chamoli district will be the summer capital of the state. Media reports suggest that the big announcement ahs come after Karnprayag MLA Surendra Singh Negi's recent meeting with the Chief Minister. Singh had demanded that Garasaina as the summer capital of Uttarakhand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X