వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయ‌మైపోయిన గాలి..! క‌న్న‌డలో క‌నిపించ‌ని మైనింగ్ మెషీన్..!!అస‌లు ఏమైంది..!!

|
Google Oneindia TeluguNews

క‌ర్ణాట‌క‌/హైద‌రాబాద్ : గాలి జనార్దన్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటకలో యడ్యూరప్ప కాబినెట్ ో టూరిజం మంత్రిగా పని చేసాడు. అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా తన పాత్ర పరోక్షంగా పోషించేవాడు. కానీ ఇప్పుడు ఎన్నికలు జరగ బోతున్నప్పటికీ ఎక్కడ కనబడట్లేదు. దేశంలో రోజురోజుకూ ఎన్నికల వేడి రాజుకుంటోంది. వివిధ పార్టీల నేతలు తమ శక్తియుక్తులన్నింటినీ కూడదీసుకొని ఎన్నికల కద రంగంలోకి దూసుకుపోతున్నారు.

దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల వేడి..! క‌ర్ణాట‌క‌లో క‌నిపించ‌ని గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి..!!

దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల వేడి..! క‌ర్ణాట‌క‌లో క‌నిపించ‌ని గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి..!!

ఇదే సమయంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, నటీనటులు తాము అభిమానించే లేదా తమకు సానుకూలమైన అభ్యర్థులకు మేలు చేకూర్చేలా ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు కార్యక్రమాలు చేస్తుంటారు. కొంత మంది నేరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రెండు రాష్ట్రాల రాజకీయాలతో సంబంధం ఉన్న ఓ కీలక వ్యక్���ి ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది, ఆయనే మైనింగ్ కింగ్, గాలి జనార్దన్‌ రెడ్డి..

వెంటాడిన కేసులు..! కొన్నాళ్లు జైలు జీవితం అనుబ‌వించిన గాలి..!!

వెంటాడిన కేసులు..! కొన్నాళ్లు జైలు జీవితం అనుబ‌వించిన గాలి..!!

మైనింగ్ వ్యాపారం ద్వారా, కోట్లాది రూపాయలు కూడ‌గ‌ట్టుకున్న గాలి జనార్దన్ రెడ్డి.. కర్ణాటక రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. 2008లో ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో గాలి పా��్ర మ‌రింత కీల‌కంగా మారింది. ఆ ఎన్నికల్లో గాలి సోదరులతో పాటు మరో 10 మంది అనుచరులు గెలుపొందారు. పలువురు మంత్రి పదవులను కూడా దక్కించుకున్నారు. ఇదే సమయంలో ఇటు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌తో గాలి సోదరులు మంచి సంబంధాలు కొనసాగించారు. రాజకీయంగా బద్ద శత్రువులైన పార్టీల్లో కొనసాగుతూ.. వీరు అత్యంత సన్నిహితంగా మెలగడం, అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. గాలి సోదరులకు మేలు చేసేలా ��్యవహరించారని, వైఎస్సార్ పలు ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు.

క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన గాలి..! క‌లిసొచ్చిన మైనింగ్ వ్యాపారం..!!

క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన గాలి..! క‌లిసొచ్చిన మైనింగ్ వ్యాపారం..!!

రాజకీయాల్లో దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేసిన గాలి జనార్దన్ రెడ్డి, ప్రస్తుతం స్తబ్దుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చి, 18 రోజులు గడుస్తున్నా.. ఆయన ఇప్పటిదాకా ఎక్కడ��� కనిపించలేదు. ఆయన అనుచరులు కూడా ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గాలి ప్రధాన అనుచరుడు శ్రీరాములు ముందు మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన కూడా పెద్దగా కనబడట్లేదు. గాలి జనార్దన్ రెడ్డిని సోదరులు సోమశేఖర రెడ్డి , కరుణాకర రెడ్డి లను రాజకీయాలకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని బీజేపీ అధిష్టానమే ఆదేశించినట్లు కన్నడ వాసులు చర్చించుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

క్ర‌మంగా రాజ‌కీయాల‌కు దూరం..! కేసుల‌నుండి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నాలు చేస్తున్న గాలి..!!

క్ర‌మంగా రాజ‌కీయాల‌కు దూరం..! కేసుల‌నుండి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నాలు చేస్తున్న గాలి..!!

2018 కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి గాలి అక్రమ వ్య‌వ‌హారాలే ప్రధాన కారణమని ఆ పార్టీ భావిస్తోందని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ ప్రభావం పడకుండా బీజేపి జాగ్రత్త పడుతోందనే చ‌ర్చ క‌న్న‌డ రాజ‌కీయాల్లో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్త��ంది. ఏపీలో వైఎస్ జగన్ తరపున ప్రచారం చేయడంలో గాలి సోదరులు బిజీగా ఉన్నారని మరికొంత మంది భావిస్తున్నారు. కానీ, ఏపీలోనూ వారి జాడ లేదన్నది స్పష్టం. మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టైన గాలి జనార్దన్ రెడ్డి.. ఆ కేసుల నుంచి బయటపడే పనిలో బిజీగా ఉన్నారని.. ఆ కారణంగానే బయట ఎక్కడా కనిపించడం లేదని మరికొందరి వాదన. కారణమేదైన‌ప్ప‌టికి గాలి జనార్దన్ రెడ్డి క‌నిపించ‌కుండా ఉండ‌టంపై పై ఇరు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జ‌రుగుతోంది.

English summary
In the Karnataka polls, the party believes that Gali janardhan Reddy is a major factor to defeat. In the Karnataka elections and the BJP is cautious in the Lok Sabha polls to avoid Gali Janardhan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X