వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 100 కోట్ల మార్పిడి: మాకేం తెలుసు, శ్రీరాములు, గాలి

కేఏఎస్ అధికారి భీమా నాయక్, డ్రైవర్ రమేష్ గౌడతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని బళ్లారి ఎంపీ బి. శ్రీరాములు స్పష్టం చేశారు. ఈ కేసులో పూర్తి దర్యాప్తు జరిగిన తరువాత అసలు విషయాలు బయటకు వస్తాయని అన్నారు.

|
Google Oneindia TeluguNews

బళ్లారి: మండ్య జిల్లా మద్దూరులో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ రమేష్ గౌడ కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదని గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, బళ్లారి ఎంపీ (బీజేపీ) బి. శ్రీరాములు అంటున్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేఏఎస్ అధికారి భీమా నాయక్, డ్రైవర్ రమేష్ గౌడతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఈ కేసులో పూర్తి దర్యాప్తు జరిగిన తరువాత అసలు విషయాలు బయటకు వస్తాయని అన్నారు.

ప్రభుత్వ అధికారి అయిన భీమా నాయక్ తో నగదు లావాదేవీలు చెయ్యవలసిన అవసరం మాకు లేదని చెప్పారు. మా మీద ఎందుకు ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు ? అనే విషయం అర్థం కావడం లేదని అన్నారు.

Gali Janardhan Reddy converted black money for his daughter's lavish wedding ?

ఎవరో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటే మా పేర్లు ఎందుకు తెర మీదకు తీసుకు వస్తున్నారో ? తెలియడం లేదని అన్నారు. మా మీద వచ్చిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదని, దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని బళ్లారి ఎంపీ శ్రీరాములు వివరించారు.

భీమా నాయక్ మాకు తెలీదు: గాలి

రెవెన్యూ శాఖ అధికారి భీమా నాయక్ ఎవరో మాకు తెలీదని మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, మాజీ శాసన సభ్యుడు గాలి సోమశేఖర్ రెడ్డి అన్నారు. భీమా నాయక్ మాకు పరిచయం కూడా కాలేదని చెప్పారు. ఇలాంటి విషయాల్లో ఎందుకు మా పేర్లు అనవసరంగా లాగుతున్నారు ? అనే విషయం తెలియడం లేదని గాలి సోమశేఖర్ రెడ్డి చెప్పారు.

English summary
Ramesh Gowda who worked as driver for a KAS officer was found dead in Maddur. In a suicide note, the man has claimed to know how Janardhana Reddy converted black money for his daughter's lavish wedding. He further alleges that he was threatened by Reddy and the KAS officer he worked for.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X