వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి పెళ్లి ఖర్చు: రోబో, బాహుబలి బడ్టెట్ దాటిందా?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి వివాహం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. గాలి అనుచరులు, ఆయన అభిమానులు ఆ పెళ్లికి హాజరై ఆనందంలో మునిగిపోయారు.

గాలి సొంత సోదరుడు పెళ్లికి ఎందుకు రాలేదంటే?గాలి సొంత సోదరుడు పెళ్లికి ఎందుకు రాలేదంటే?

గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి జరిగిన ప్యాలెస్ గ్రౌండ్స్ లోని ప్రాంతంలో ఈ నెల 20వ తేది నుంచి పర్యాటకులు ఆ అద్బుతమైన సెట్టింగ్స్ చూడటానికి అనుమతి ఇచ్చారని తెలిసింది. అప్పటి వరకు అక్కడ ఏర్పాటు చేసిన సెట్టింగ్స్ దగ్గర ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి అనుమతి లేదని ప్యాలెస్ గ్రౌండ్స్ లో పని చేస్తున్న వారు చెబుతున్నారు.

గాలి బ్రహ్మిణి వజ్రాల నగలు ఎన్ని రూ. కోట్లు అంటే?గాలి బ్రహ్మిణి వజ్రాల నగలు ఎన్ని రూ. కోట్లు అంటే?

అదిరిపోయే సెట్టింగ్స్

అదిరిపోయే సెట్టింగ్స్

బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో గతంలో అనేక మంది వీవీఐపీలు, వీఐపీల కుటుంబ సభ్యుల పెళ్లిళ్లు జరిగాయి. అక్కడ పెళ్లిళ్లు చేసిన వారు వారివారి అభిరుచుల మేరకు కల్యాణ మండపాలు, ప్రవేశ ద్వారాలు, సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకున్నారు.

సెట్టింగ్స్ చూడతరమా !

సెట్టింగ్స్ చూడతరమా !

ఇప్పటి వరకు బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఎవ్వరూ వేయని విధంగా గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి పెళ్లికి అదిరిపోయే సెట్టింగ్స్ వేయించారని ఆయన అభిమానులు అంటున్నారు. ఇలాంటి అద్భుతమైన సెట్టింగ్స్ ఒక్క సారి చూస్తే చాలని అంటున్నారు.

గ్రామీణ వాతావరణం అంటే ఇష్టం

గ్రామీణ వాతావరణం అంటే ఇష్టం

గాలి జనార్దన్ రెడ్డి చిన్నతనం నుంచి గ్రామీణ వాతావరణంలో పెరిగారు. గాలి జనార్దన్ రెడ్డి ఆ రోజులు ఇప్పటికీ మరిచిపోలేదని ఆయన అభిమానులు అంటున్నారు. అందు కోసం కుమార్తె పెళ్లి జరిగే చోట పల్లె వాతావరణం ఉట్టిపడేలా సెట్టింగ్స్ వేయించారని ఆయన అభిమానులు అంటున్నారు.

వాయువేగంతో పుకార్లు షికార్లు !

వాయువేగంతో పుకార్లు షికార్లు !

గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి పెళ్లి విషయంలో మీడియాలో పలురకాలు పుకార్లు వచ్చాయి. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, కాదు కాదు కోన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని వార్తలు వచ్చాయి.

పట్టించుకోలేదు

పట్టించుకోలేదు

గాలి జనార్దన్ రెడ్డి మాత్రం అలాంటి పుకార్లు పట్టించుకోకుండా ప్రశాంతంగా ఆయన తనపని తాను చేసుకుంటూ వెళ్లారు. ఎవరెన్ని పుకార్లు చేసినా వాటిని పట్టించుకోలేదు. పలువురు చేసిన విమర్శలను ఆయన మార్గదర్శకాలుగా తీసుకున్నారు.

గాలికి మాత్రం అసలు విషయం

గాలికి మాత్రం అసలు విషయం

ఓ రాష్ట్రానికి మంత్రిగా పని చేసి, మైనింగ్ వ్యాపారంలో ఓ వెలుగు వెలిగిన గాలి జనార్దన్ రెడ్డికి ఎప్పుడు ఏమి చెయ్యాలో తెలిదా ? అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు పట్టించుకుంటూ వెలితే ఇక చెయ్యడానికి ఏమీ మిగలదని వారు అంటున్నారు.

అందరికి అనుకూలంగా

అందరికి అనుకూలంగా

గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి ఎలా చెయ్యాలి ? అని సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులను అడిగి వారి అభిప్రాయం తెలుసుకున్నారు. బెంగళూరులో పెళ్లి చేస్తే అందరికి బాగుంటుందని నిర్ణయించారు.

గాలి అభిరుచి మేరకే

గాలి అభిరుచి మేరకే

గాలి జనార్దన్ రెడ్డికి విజయనగర సామ్రాజ్యం రారాజు శ్రీ కృష్ణదేవరాయలు అంటే ఎంతో గౌరవం, అభిమానం. విజయనగర సామ్రాజ్యానికి చెందిన అనేక కార్యక్రమాలను గతంలో గాలి జనార్దన్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.

విజయనగర సామ్రాజ్యం

విజయనగర సామ్రాజ్యం

విజయనగర సామ్రాజ్యం ఇలా ఉండేది అని ఈ కాలంలో అందరికి తెలిసే విధంగా గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ లో భారీగా సెట్టింగ్స్ వేయించారు. గాలి జనార్దన్ రెడ్డి చెప్పినట్లే ఆర్ట్ డైరెక్టర్ శశిధర అడప తదితరులు అదిరిపోయే సెట్టింగ్స్ వేయించారు.

ఏడుకోండలస్వామి

ఏడుకోండలస్వామి

పెళ్లి మండపం మాత్రం తిరుమల వెంకటేశ్వరుడు ఎలా కోలువు తీరారో అలానే సెట్టింగ్స్ వేయించారు. నిలువెత్తు ఏడుకోండల స్వామి సన్నిధిని నిజంగా చూసినట్లే ఉండేలా అద్బుతమైన సెట్టింగ్స్ వేయించారు.

విజయనగర సామ్రాజ్యం, హంపి అందాలు

విజయనగర సామ్రాజ్యం, హంపి అందాలు

విజయనగర సామ్రాజ్యం, హంపిలోని అద్బుతాలు గుర్తుకు వచ్చేలా బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ దర్శనం ఇస్తుంది. ఇక్కడ ఈనెల 20 నుంచి పర్యాటకులు ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి అవకాశం ఉందని అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు అంటున్నారు.

రూ.ఎన్ని కోట్లు అంటే !

రూ.ఎన్ని కోట్లు అంటే !

గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహం చెయ్యడానికి రూ. 100 కోట్లు, రూ. 300 కోట్లు, కాదు కాదు రూ. 500 కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రాంతీయ, జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఎవరికి తోచినట్లు వారు లెక్కలు వేసుకున్నారు.

రోబో-2 (2.0), బాహుబలిని మించిపోయిందా ?

రోబో-2 (2.0), బాహుబలిని మించిపోయిందా ?

రజనీ కాంత్ రోబో-2 (రూ.350 కోట్లు) , ఎస్ఎస్ రాజమౌళి బహుబలి (రూ.250 కోట్లు), ప్రేమ్ రతన్ ధన్ పాయో (రూ.180 కోట్లు) సినిమాల బడ్జట్ దాటి పోయిందా ? అంటూ గాలి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పుకార్లు ఎన్ని వచ్చినా పెళ్లికి మాత్రం అన్ని కోట్ల రూపాయలు ఖర్చుచెయ్యలేదని ఆ వార్తలను కొట్టిపారేస్తున్నారు.

English summary
Gali Janardhan Reddy, for his daughter concluded at the Palace Grounds in Bengaluru on Wednesday. Karnataka Governor Vajubhai Vala, State Home Minister G Parameshwara, Energy Minister D K Shivakumar, Rural Development Minister H K Patil and former chief minister B S Yeddyurappa were among the over 50,000 guests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X