వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి జనార్ధన్ రెడ్డి పేరుతో నకిలి ఫేస్ బుక్ అకౌంట్లు ఎన్ని?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్థన్ రెడ్డి పేరుతో నకిలి ఫేస్‌బుక్ అకౌంట్లు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అకౌంట్లు ఓపెన్ చేసిన వారిని పోలీసు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. తనకు ఎలాంటి ఫేస్‌బుక్ అకౌంట్లు లేవని గాలి జనార్ధన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.

నకిలి ఫేస్‌బుక్ అకౌంట్లు ఓపెన్ చేసిన వారి గురించి సీఐడీ పోలీసులు ఆరా తీస్తున్నారు. గాలి జనార్థన్ రెడ్డి పర్సనల్ సెక్రటరీ బి శివకుమార్ ఇటీవల బెంగళూరులోని సీఐడీ కార్యాలయంలో నకిలీ ఫేస్‌బుక్‌ల పైన ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

 Gali Janardhan Reddy in illegal facebook accounts issue

గాలి జనార్ధన్ రెడ్డి అభిమానుల సంఘం, రెడ్డి అభిమానుల సంఘం, గాలి జనార్ధన్ రెడ్డి తదితర పేర్లతో నకిలీ పేస్‌బుక్ అకౌంట్లు దర్శనం ఇచ్చాయి. అయితే ఈ అకౌంట్లలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పేరుతో ఫేస్‌బుక్‌లో ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేసి తన పరువు తీస్తున్నారని గాలి జనార్ధన్ రెడ్డి తన పీఏ శివకుమార్ ద్వార సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

గాలి జనార్ధన్ రెడ్డి పేరు మీద నకిలి ఫేస్‌బుక్ అకౌంట్లు ప్రారంభించి అనుచతితంగా పోస్టు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని గాలి పీఏ శివకుమార్ సీఐడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి జైలులో ఉన్న సమయంలో ఈ నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు ఓపెన్ చేశారని, ఎన్ని అకౌంట్లు ఉన్నాయనేది ఆరా తీస్తున్నామని సీఐడీ పోలీసులు చెబుతున్నారు.

English summary
Gali Janardhan Reddy in illegal facebook accounts issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X