వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డికి నో బెయిల్, న్యాయవాదిని ప్రశ్నించిన కోర్టు, ఊహించుకున్నారా, వాయిదా ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయంతో కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరు కోర్టు ఆశ్రయించారు. గాలి జనార్దన్ రెడ్డి సమర్పించిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అరెస్టు చేస్తారని మీరు ముందుగానే ఊహించుకుంటున్నారా ? అంటూ గాలి న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.

కౌంటర్ పిటిషన్

కౌంటర్ పిటిషన్

గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసే విషయంలో మీకు అభ్యంతరం ఉంటే కౌంటర్ పిటిషన్ దాఖలు చెయ్యాలని సీసీబీ పోలీసులకు న్యాయస్థానం సూచించింది. ఆండిడెంట్ కంపెనీ చీటింగ్ కేసుతో గాలి జనార్దన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, బెయిల్ మంజూరు చెయ్యాలని ఆయన న్యాయవాది హనుమంతరాయ కోర్టులో మనవి చేశారు.

విచారణకు ఎందుకు రాలేదు ?

విచారణకు ఎందుకు రాలేదు ?

కేసు వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం సీసీబీ పోలీసుల విచారణకు గాలి జనార్దన్ రెడ్డి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించింది. విచారణకు హాజరు అయితే సీసీబీ పోలీసులు అరెస్టు చేస్తారని భయంతో హాజరుకాలేదని న్యాయవాది హనుమంతరాయ సమాధానం ఇచ్చారు.

ఊహించుకున్నారా ?

ఊహించుకున్నారా ?

విచారణకు హాజరు అయితే గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేస్తారు అని మీరు ఎందుకు భావిస్తున్నారని ఆయన న్యాయవాది హనుమంతరాయను కోర్టు ప్రశ్నించింది. గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేస్తారని మీరు ముందుగానే ఎలా ఊహిస్తారని కోర్టు ప్రశ్నించింది.

ఆదివారం హాజరు ?

ఆదివారం హాజరు ?

48 గంటల్లో విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు గాలి జనార్దన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ముందుస్తు బెయిల్ మంజూరు చేస్తే ఆదివారం కచ్చితంగా సీసీబీ పోలీసుల ముందు గాలి జనార్దన్ రెడ్డి విచారణకు హాజరు అవుతారని ఆయన న్యాయవాది హనుమంతరాయ కోర్టులో వివరించారు.

బెయిల్ రద్దు చెయ్యండి !

బెయిల్ రద్దు చెయ్యండి !

కేసు వాదనలు విన్న న్యాయస్థానం గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సోమవారానికి వాయిదా వేసింది. గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు ఆలీఖాన్ కు మంజూరు చేసిన బెయిల్ రద్దు చెయ్యాలని సీసీబీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆలీఖాన్ బెయిల్ పిటిషన్ విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.

English summary
Gali Janardhan Reddy's anticipatory bail application inquiry postponed to monday. CCB searching Gali Janardhan Reddy in Ambident bribery case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X