వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా జీవితం నాశనం చేశారు, మాజీ సీఎంకు మానం మర్యాద లేదు: గాలి జనార్దన్ రెడ్డి ఫైర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు మానం, మర్యాద ఏ మాత్రం లేదని, నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారని ఆ రాష్ట్ర మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. పరువు మర్యాద లేని వ్యక్తుల గురించి మాట్లాడటం శుద్దదండగ అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తన జీవితాన్ని నాశనం చేశారని గాలి జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

మాళకాల్మూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మేము అక్రమ మైనింగ్ కు పాల్పడ్డామని సిద్దరామయ్య నేటికీ తప్పుడు ప్రచారం చేస్తూ తిరుగుతున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

మా దెబ్బకు హడల్

మా దెబ్బకు హడల్

బళ్లారి లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో మా సోదరి శాంతా పోటీ చేస్తున్నారని, ఆమెను ప్రజలు కచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం తనకు ఉందని గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శ్రీరాములు కార్పొరేటర్ గా, ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి మంత్రిగా పని చేశారని, ఆయన చేసిన సేవలు గుర్తు పెట్టుకుని ప్రజలు శాంతాకు ఓట్లు వేస్తారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మా దెబ్బతో సిద్దరామయ్యతో పాటు సంకీర్ణ ప్రభుత్వం పెద్దలు అందరూ బళ్లారికి వచ్చి మకాం వేశారని గాలి జనార్దన్ రెడ్డి ఎద్దేవ చేశారు.

పరువు మర్యాద లేదు

పరువు మర్యాద లేదు


తన పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, బి. నాగేంద్ర అక్రమ మైనింగ్ చేశారని, సిద్దరామయ్య వారిద్దరిని కుడివైపు, ఎడమవైపు కుర్చోపెట్టుకుని తాను అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తన మీద అక్రమ మైనింగ్ ఆరోపణలు చేసిన వారిమీద పరువు నష్టం దావా వెయ్యాలని ఆలోచించానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అయితే పరువు లేని వారి పరువు నష్టం దావా ఏమి వేస్తామని సిద్దరామయ్య గురించి పట్టించుకోలేదని గాలి జనార్దన్ రెడ్డి వ్యంగంగా అన్నారు.

రూ. కోట్లు చిక్కినా సిగ్గు లేదు

రూ. కోట్లు చిక్కినా సిగ్గు లేదు

తన మీద, సన్నిహితుల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసిన సమయంలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా చిక్కలేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అయితే కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్, ఆయన సన్నిహితులు నివాసాలు, కార్యాలయాల్లో కోట్ల రూపాయలను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు లేదని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తన మీద ఎలాంటి ఆరోపణలు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

రూ. లక్ష కోట్లు లూటీ చేశానా ?

రూ. లక్ష కోట్లు లూటీ చేశానా ?

అక్రమ మైనింగ్ ద్వారా తాను రూ. ఒక లక్ష కోట్లు లూటీ చేశానని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపిస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు. ఇదే సిద్దరామయ్య తాను రూ. 25 కోట్లు లూటీ చేశారని ఫేస్ బుక్ లో పోస్టు చేశారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ తో రూ. 35 వేల కోట్లు లూటీ చేశారని రాహుల్ గాంధీ ట్వీట్టర్ లో పోస్టు చేశారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఇందులో ఏది నిజం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా చెప్పాలని గాలి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. మీరు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మీరే చెబుతున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఎద్దేవ చేశారు.

నా జీవితం నాశనం చేశారు

నా జీవితం నాశనం చేశారు

ఐదు సంవత్సరాలు సీఎం పదవిలో ఉన్న సిద్దరామయ్య బళ్లారి జిల్లాతో పాటు తన జీవితాన్ని నాశనం చేశారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తనను నాలుగు సంవత్సరాలు జైల్లో పెట్టారని, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు తన మీద తప్పుడు ప్రచారం చేస్తూ తన జీవితం నాశనం చేశారని గాలి జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

పీహెచ్ డీ చేశారు

పీహెచ్ డీ చేశారు

కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను ఏడు సంవత్సరాలు బళ్లారి ప్రజలకు దూరం చేశారని, అయితే వారి ప్రేమాభిమానాలు మాత్రం తనకు దూరం చెయ్యలేకపోయారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తాము సూచించిన వ్యక్తికే అక్కడి ప్రజలు ఓట్లు వేస్తారని గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డబ్బుతో ప్రజల ఓట్లు కొనుగోలు చెయ్యాలని మంత్రి డీకే. శివకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కుళ్లు, కుతంత్ర రాజకీయాలు చెయ్యడంలో మంత్రి డీకే. శివకుమార్ పీహెచ్ డీ పట్టా సంపాధించారని, వారి రాజకీయాలు బళ్లారిలో సాగవని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు.

English summary
Ballari by election: Former Minister Janardhan Reddy slams EX CM Siddaramaiah over his remark on illegal mining. Siddaramaiah has no shame, as he is giving statement against me while sitting with main accuses of illegal mining Anand Singh and Nagendra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X