వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డి బ్యాచ్ కు మంత్రి పదవులు ఇస్తే అంతే, ఏం చేశారో చూడండి, గనుల వ్యాపారి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి శ్రీరాములు అనుచరులకు (బ్యాచ్) మంత్రి పదవులు ఇవ్వరాదని గనుల వ్యాపారి టపాల్ గణేష్ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు మనవి చేశారు. కర్ణాటక శాసన సభలో సీఎం యడియూరప్ప బలపరీక్ష ఎదుర్కొని విజయం సాధించారు. సోమవారం గనుల వ్యాపారి టపాల్ గణేష్ సీఎం యడియూరప్పకు ఈ విధంగా మనవి చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

తెర మీదకు గాలి పేరు

తెర మీదకు గాలి పేరు

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులతో పాటు బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములకు మంత్రి పదవులు ఇవ్వరాదని గనుల వ్యాపారి టపాల్ గణేష్ సీఎం యడియూరప్పకు మనవి చేశారు.

చెడ్డపేరు తెచ్చారు

చెడ్డపేరు తెచ్చారు

అక్రమ గనుల వ్యాపారం, రాష్ట్రాల సరిహద్దులు నాశనం చేశారని, రిపబ్లిక్ ఆఫ్ బళ్లారికి గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు వర్గీయులు చెడ్డపేరు తీసుకువచ్చారని టపాల్ గణేష్ ఆరోపించారు. 2008లో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు వర్గీలు ఏం చేశారో అనే విషయం గుర్తు పెట్టుకోవాలని టపాల్ గణేష్ అంటున్నారు.

ఇద్దరూ ఒక్కటే

ఇద్దరూ ఒక్కటే

అక్రమ గనుల కేసులో శ్రీరాములు పేరు లేదని, అయితే గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు వైఖరి ఒక్కటే అని టపాల్ గణేష్ చెప్పారు. శ్రీరాములు మంత్రి అయితే గాలి జనార్దన్ రెడ్డి మంత్రి అయినట్లే అని టపాల్ గణేష్ చెప్పారు. అందువలనే శ్రీరాములుకు మంత్రి పదవి ఇవ్వరాదని టపాల్ గణేష్ అంటున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్

గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్

బళ్లారి శ్రీరాములతో పాటు గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డికి ఎలాంటి పరిస్థితుల్లో మంత్రి పదవులు ఇవ్వరాదని టపాల్ గణేష్ డిమాండ్ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులకు కాకుండా బీజేపీ కోసం పని చేసిన వారికి మంత్రి పదవులు ఇవ్వాలని సీఎం యడియూరప్పకు టపాల్ గణేష్ మనవి చేశారు.

English summary
Janardana Reddy, Sriramulu should not include in new BJP government, requested by mining businessman Tapal Ganesh to CM Yeddyurappa through video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X