గాలి పెళ్లిసందడి ఇలా మొదలయ్యింది (ఫోటోలు)
బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి వివాహ వేడుకల్లో బిజీబిజీగా ఉన్నారు. గాలి బ్రహ్మిణి పెళ్లి శుభలేఖలతోనే వార్తల్లో నిలిచిన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఆమె పెళ్లి ఘనంగా చెయ్యడానికి సర్వం సిద్ధం చేశారు.
గాలికి సుడిగాలి కష్టాలు: బళ్లారీలో కేసు నమోదు
వేరే విషయాలు పట్టించుకోకుండా ఆయన కేవలం పెళ్లి ఘనంగా చెయ్యాలని పట్టుదలతో ఉన్నారు. ఏది ఏమైనా సరే ? ముందుగా అనుకున్నట్లు తన కుమార్తె వివాహం జరిపించి తన వాళ్లకు మళ్లీ దగ్గర అవ్యాలని గాలి జనార్దన్ రెడ్డి నిర్ణయించారు.
మోడీ సంచలనం: గాలి కుమార్తె పెళ్లి ఏలా ?
ముహుర్తం వచ్చేసింది
హైదరాబాద్ కు చెందిన రాజీవ్ రెడ్డితో గాలి బ్రహ్మిణి వివాహం నిశ్చయం అయిన విషయం తెలిసిందే. ఈనెల 16వ తేదిన బెంగళూరు నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో వివాహం చెయ్యడానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బళ్లారీలో అనుచరుల సమక్షంలో
తను చక్రం తిప్పిన బళ్లారీ జిల్లాకు దాదాపు ఐదు సంవత్సరాలు దూరం అయిన గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి కోసం న్యాయస్థానంలో అనుమతి తీసుకుని ఇటీవలే బళ్లారీ నగరంలో అడుగు పెట్టారు.
అపూర్వ స్వాగతం
ఐదు సంవత్సరాల తరువాత బళ్లారీలో అడుగు పెట్టిన గాలిజనార్ధన్ రెడ్డికి ఆయన అభిమానులు, స్నేహితులు ఘనంగా స్వాగతం పలికారు. దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు ర్యాలీగా తీసుకు వెళ్లి ఎప్పుడూ మీ వెంటే ఉంటాము అన్నాఅంటూ ఆయనకు ధైర్యం చెప్పారు.
ప్రముఖులు, నాయకులు, కుటుంబ సభ్యులతో
గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి వివాహ వేడుకలకు సోమవారం బళ్లారీలో శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం 9.30 గంటల తరువాత శ్రీ గణపతి పూజ, గణపతి హోమం, తదితర పూజలతో పెళ్లి శుభకార్యం మొదలు పెట్టారు. మద్యాహ్నం 1 గంటకు దేవాలయంలో భజనలు చేశారు.
ఐదు నదుల నుంచి జలాలు
శుభ కార్యానికి వచ్చిన వారందరికి ప్రత్యేక వంటకాలతో పాటు భోజనాలు పెట్టారు. మంగళవారం కావేరి, కృష్ణ, తుంగభద్ర, మలప్రభ, ఘటప్రభా నదుల నుంచి 100 లీటర్లు నీరు సేకరించి తీసుకు వచ్చారు. వధూవరులకు ఈ నదీ జలాలతోనే మంగళస్నానాలు చేస్తున్నారు. సోమవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు ప్రతి రోజు పెళ్లి సందడి ఉంటుందని గాలి అభిమానులు తెలిపారు.
బళ్లారీ మొత్తం
తన ప్రాణస్నేహితుడు శ్రీరాములతో కలిసి గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీలో సుడిగాలి పర్యటన చేశారు. బళ్లారీలోని ప్రతి ఒక్కరిని తన కుమార్తె పెళ్లికి వచ్చి ఆశిర్వధించాలని గాలి స్థానికులకు, అభిమానులకు మనవి చేశారు.
రాజకీయ నాయకులు, సినీ ప్రములు, వ్యాపారవేత్తలు
గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని రాజకీయ నాయకులతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ చిత్రరంగానికి చెందిన ప్రముఖులను తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించారు.
సందడే సందడి
కేంద్ర మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, శాసన సభ్యులు గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహానికి వస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో బాలీవుడ్, కోలివుడ్, టాలీవుడ్, శ్యాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటీనటుల డ్యాన్స్ లు, ప్రత్యేక సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారని గాలి అనుచరులు అంటున్నారు.