వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి సొంత సోదరుడు పెళ్లికి ఎందుకు రాలేదంటే ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహానికి ఆయన సొంత సోదరుడు, కర్ణాటక మాజీ మంత్రి గాలి కరుణాకర్ రెడ్డి ఎందుకు రాలేదు ? అనే విషయంపై ఇప్పుడు వాడివేడిగా చర్చ మొదలైయ్యింది

గాలి జనార్దన్ రెడ్డికి గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డి సొంత సోదరులు. బళ్లారి ఎంపీ శ్రీరాములు గాలికి సొంత సోదరుడితో సమానం. గాలి జనార్దన్ రెడ్డి ఎంతో ఖర్చు పెట్టి తన కుమార్తె బ్రహ్మిణి పెళ్లి ఘనంగా చేశారు.

తన కుమార్తె బ్రహ్మిణి పెళ్లికి గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకతో సహ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలను ఆహ్వానించారు. వారిలో చాల మంది గాలి ఇంట జరిగిన పెళ్లికి హాజరైనారు.

Gali Janardhana Reddy has invited one and all for his daughter Bahmini's marriage

గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం అని ఆయన అభిమానులు చాలసార్లు ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక హోం శాఖా మంత్రి జీ. పరమేశ్వర్, ఇందన శాఖా మంత్రి డీకే. శివకుమార్ తో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు గాలి కుమార్తె పెళ్లికి హాజరైనారు.

అయితే సొంత సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి తన కుమార్తె పెళ్లికి రాకపోవడంతో గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన అభిమానులు భాదపడ్డారని సమాచారం. అయితే ఏ కారణం లేకుండా గాలి కరుణాకర్ రెడ్డి ఎందుకు పెళ్లికి రాలేదు ? అని బళ్లారి జిల్లాతో పాటు గాలి అభిమానుల్లో చర్చ మొదలైయ్యింది.

గాలి జనార్దన్ రెడ్డి ఏకైక కుమార్తె బ్రహ్మిణి అంటే గాలి కరుణాకర్ రెడ్డికి చాల ఇష్టం. అలాంటి కూతురు పెళ్లికి ఆయన ఎందుకు రాలేదు ? ఏం జరిగింది ? ఎందుకు దూరంగా ఉంటున్నారు ? అని గాలి అభిమానులు ఆలోచనలోపడ్డారు.

English summary
Mining baron and former Karnataka minister G Janardhana Reddy has invited one and all for his daughter Bahmini's marriage with Rajeev Reddy. The wedding invite includes a box.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X