బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి కోసం గాలిస్తున్నాం, అంబిడెంట్ స్కాం రూ. 600 కోట్లు: బెంగళూరు పోలీసు కమీషనర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో డీల్ కుదుర్చుకుని ప్రజలకు మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరులోని అంబిడెంట్ గ్రూప్ కంపెనీకి సంబంధించి నగర పోలీసు కమీషనర్ టీ. సునీల్ కుమార్ వివరాలు వెల్లడించారు. గాలి జనార్దన్ రెడ్డి కోసం గాలిస్తున్నామని, అంబిడెంట్ స్కాం రూ. 600 కోట్లు అని సునీల్ కుమార్ చెప్పారు.

Recommended Video

గాలి జనార్దన్ రెడ్డి పరార్...?

<strong>మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పరార్ ? పోలీసుల వేట, 57 కేజీల బంగారం, ఈడీకి లంచం!</strong>మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పరార్ ? పోలీసుల వేట, 57 కేజీల బంగారం, ఈడీకి లంచం!

మార్కెటింగ్ కంపెని

మార్కెటింగ్ కంపెని

బుధవారం బెంగళూరు నగరంలోని పోలీసు కమీషనర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సునీల్ కుమార్ అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నగరంలోని డీజే హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేశారని వివరించారు.

50 శాతం వడ్డీ

50 శాతం వడ్డీ

అహమ్మద్ ఫరీద్ కు చెందిన ఈ అండిడెంట్ కంపెనీ 4 నెలలకు 40 % నుంచి 50 % వడ్డీ ఇస్తామని నమ్మించి దాదాపు 15 వేల మంది నుంచి రూ. 600 కోట్లు వసూలు చేసి మోసం చేశారని సునీల్ కుమార్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అహమ్మద్ ఫరీద్, రమేష్ అనే ఇద్దరిని అరెస్టు చేశామని సునీల్ కుమార్ చెప్పారు.

రూ. 20 కోట్లు డీల్

రూ. 20 కోట్లు డీల్

ఇప్పటికే అహమ్మద్ ఫరీద్ మీద ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారని సునీల్ కుమార్ అన్నారు. ఈ సందర్బంలో అంబిడెంట్ కంపెనీ యజమాని మహమ్మద్ ఫరీద్, గాలి జనార్దన్ రెడ్డి, ఆలీఖాన్ సమావేశం అయ్యారని, కేసు మూసివేయడానికి రూ. 20 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని సునీల్ కుమార్ అన్నారు.

బళ్లారి రాజ్ మహల్

బళ్లారి రాజ్ మహల్

డీల్ ప్రకారం రూ. 20 వేల కోట్ల విలువైన బంగారం ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి సూచించారని సునీల్ కుమార్ చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు ఆలీఖాన్ కు పరిచం ఉన్న బళ్లారిలోని రాజ్ మహల్ ఫ్యాన్సీ జ్యువెలర్స్ సంస్థ యజమాని రమేష్ సహకారంతో బెంగళూరులోని అంబికా సేల్స్ కార్పొరేషన్ కు చెందిన రమేష్ కోఠారి దగ్గర రూ. 18 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేశారని విచారణలో వెలుగు చూసిందని సునీల్ కుమార్ వివరించారు.

20 బ్యాంక్ అకౌంట్స్ సీజ్

20 బ్యాంక్ అకౌంట్స్ సీజ్

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అంబిడెంట్ కంపెనీ యజమాని మహమ్మద్ ఫరీద్, రాజ్ మహల్ జ్యువెలర్స్ యజమాని రమేష్ ను అరెస్టు చేశామని, గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుడు ఆలీఖాన్ కోసం గాలిస్తున్నామని పోలీసు కమీషనర్ సునీల్ కుమార్ వివరించారు. ఆలీఖాన్ కు సంబంధించిన 20 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి విచారణ చేస్తున్నామని సునీల్ కుమార్ మీడియాకు చెప్పారు.

English summary
Bengaluru police commissioner T Suneel Kumar said that Gali Janardhana Reddy is on the run. Bengaluru Police Commissioner T. Suneel Kumar, said, Several cases were registered against Ambidant. The company cheated people by promising to double investments More people are involved in this scam, can't reveal the details now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X