బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డికి 48 గంటలు డెడ్ లైన్: నోటీసులు జారీ, న్యాయవాదుల ధీమా, హైదరాబాద్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పై న్యాయవాదుల ధీమా..! | Oneindia Telugu

బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి 48 గంటల్లో విచారణకు హాజరుకావాలని బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అనే చిన్న క్లూ కూడా ఇంత వరకు సీసీబీ పోలీసులకు చిక్కలేదు.

గాలి కోసం గాలిస్తున్నాం, అంబిడెంట్ స్కాం రూ. 600 కోట్లు: బెంగళూరు పోలీసు కమీషనర్!గాలి కోసం గాలిస్తున్నాం, అంబిడెంట్ స్కాం రూ. 600 కోట్లు: బెంగళూరు పోలీసు కమీషనర్!

హైదరాబాద్ లో వేట ?

హైదరాబాద్ లో వేట ?

హైదరాబాద్ లో గాలి జనార్దన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. బెంగళూరు సీసీబీ పోలీసుల దర్యాప్తుకు హైదరాబాద్ నగర పోలీసులు సహకరిస్తున్నారని అంటున్నారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ లో లేరని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

15 మంది ఫోన్ల మీద నిఘా

15 మంది ఫోన్ల మీద నిఘా

గాలి జనార్దన్ రెడ్డి మొబైల్ ఫోన్ స్వీచ్ఆఫ్ అయ్యిందని సీసీబీ పోలీసులు అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న 15 మంది మొబైల్ ఫోన్లు మీద పోలీసులు నిఘా వేశారు. కచ్చితంగా 15 మందిలో ఎవరితో ఒకరిని గాలి జనార్దన్ రెడ్డి సంప్రధించే అకాశం ఉందని సీసీబీ పోలీసులు అంటున్నారు.

బెయిల్ కోసం కోర్టుకు

బెయిల్ కోసం కోర్టుకు

దీపావళి పండుగ సందర్బంగా గురువారం కోర్టుకు సెలవు కావడంతో శుక్రవారం గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాదులు కోర్టులో బెయిల్ కోసం అర్జీ సమర్పించారు. శుక్రవారం మద్యాహ్నం గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని ఆయన న్యాయవాదులు అంటున్నారు.

గాలి న్యాయవాదుల ధీమా

గాలి న్యాయవాదుల ధీమా

ఆంబిడెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు అహమ్మద్ ఫరీద్ ప్రజలకు మోసం చేశాడని అరెస్టు అయ్యాడని, అతనికీ బెయిల్ వచ్చిందని, ఇదే కేసులో అరెస్టు అయిన రమేష్ కు బెయిల్ వచ్చిందని గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాదులు చెప్పారు. ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆయన న్యాయవాదులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం పాత్రలేదు

ప్రభుత్వం పాత్రలేదు

గాలి జనార్దన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారని, ఇందులో సంకీర్ణ ప్రభుత్రం పాత్రలేదని కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. ఒక సంవత్సరం నుంచి ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు విచారణ చేస్తున్న పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులను విచారించడానికి సిద్దం అయ్యారని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి డీకే. శివకుమార్ చెప్పారు.

English summary
Karnataka former minister Gali Janardhana Reddy is waiting for anticipatory bail application order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X