వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నకిలీ పర్మిట్లతో గాలి అక్రమ మైనింగ్ ఆపరేషన్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగళూర్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నకిలీ పర్మిట్లతో ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమ మైనింగ్ వ్యవహారాలను నడిపినట్లు సిబిఐ ఆరోపిస్తోంది. ముడి ఇనుము తవ్వకం నునంచి బేలేకేరి ఓడరేవుకు తరలించే వరకు మూడంచెల వ్యవస్థను గాలి జనార్ధన్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ పర్మిట్ల వ్యవహారం వివరాలను సిబిఐ తన చార్జిషీట్‌లో పొందుపరిచింది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో గురువారం వార్తాకథనాలు వచ్చాయి.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు. స్వస్తిక్ నాగరాజు, కారంపూడి మహేష్, ఇతర గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఆంధ్రప్రదేశ్ మైన్స్ జియాలజీశాఖ, అటవీ నకిలీ పర్మిట్లతో పాటు ఇన్‌వాయిసెస్ సమర్పించి, 2009 జనవరి 1వ తేదీ నుంచి 2010 మే 31వ తేదీ వరకు అక్రమంగా ముడి ఇనుమును బేలెకేరి పోర్టుకు తరలించినట్లు సిబిఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో ఆరోపించింది.

షాఫియా మినరల్స్, మంజునాథేశ్వర మినరల్స్ వంటి సంస్థలను ఉద్యోగులు, బంధువుల పేర్ల మీద సృష్టించి ఇన్‌వాయిస్‌లు అచ్చు వేసి నకిలీ పర్మిట్లతో పాటు ముడి ఇనుమును రవాణా చేసే వాహనాలకు ఇచ్చేవారని సిబిఐ ఆరోపించింది. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడు అలీ ఖాన్ అటువంటి సంస్థలను సృష్టించినట్లు, ఆ సంస్థల ద్వారా భారీగా డబ్బులను జనార్దన్ రెడ్డికి తరలించినట్లు సిబిఐ ఆరోపించింది.

అలీ ఖాన్ ఇతర మైన్స్ యజమానులను బెదిరించి వాటిని తీసుకునేవాడని, అక్రమ తవ్వకాల గురించి గానీ రవాణా గురించి గానీ ప్రశ్నించినప్పుడు అటవీ, డిఎంజి అధికారులను, పోలీసులను కూడా బెదిరించేవాడని సిబిఐ ఆరోపించింది. జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్‌ వ్యవహారాలకు పాల్పడడమే కాకుండా ఈ వ్యాపారంలో ఉన్న ఇతర వ్యక్తుల నుంచి డబ్బులు గుంజేవాడని సిబిఐ ఆరోపించింది.

English summary

 Karntaka former minister Gali Janardhan Reddy, who controlled a three-tier system spanning the entire operation of illegal iron ore mining from excavation to the wharfs of Belekeri port, used fake permits from Andhra Pradesh to carry out his operations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X