వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాల్వాన్ ఘర్షణ తర్వాత దిగజారిన పరిస్థితి: విదేశాంగశాఖ మంత్రి జై శంకర్

|
Google Oneindia TeluguNews

గాల్వాన్ వ్యాలీ వద్ద ఉద్రిక్తతతో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారుతూ వస్తోన్నాయి. ఇరు దేశాల సైన్యం మొహరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాల్వాన్ ఘర్షణతో ఇరు దేశాల మధ్య ప్రజా, రాజకీయ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిందని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ఏసియా సొసైటీ నిర్వహించిన సదస్సులో వర్చువల్ విధానంలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. 1993 నుంచి ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు ఉన్నాయని గుర్తుచేశారు.

Galwan clashes left India’s relationship with China

అందులో సరిహద్దు ప్రాంతాల్లో తక్కువ బలగాల మొహరింపు.. సరిహద్దు వద్ద భద్రత ఎలా చేపట్టాలి.. బోర్డర్ వద్ద ఇరుదేశాలకు చెందిన బలగాలు ఎలా వ్యవహరించాలనే అంశం ఉందని జై శంకర్ తెలిపారు. కానీ దీనిని ఉల్లంఘించడంతో ఘర్షణ జరిగిందని తెలిపారు. జూన్ 15వ తేదీన ఏం జరిగింది అని ప్రశ్నించారు. దీంతో 1975 తర్వాత తొలిసారి యుద్ద మేఘాలు కమ్ముకున్నాయని చెప్పారు.

Recommended Video

India-China Stand Off: చైనా.. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు! - విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

జూన్ 15వ తేదీన తూర్పు లడాఖ్ వద్ద గల గాల్వాన్ వ్యాలీ వద్ద భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ నెలకొంది. రాళ్లతో దాడి చేయడంతో కల్నల్ సంతోష్ సహా 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు. ఇక అప్పటినుంచి సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

English summary
clashes between India and China in Ladakh’s Galwan Valley had a very deep public and political impact and left the relationship between the two countries “profoundly disturbed”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X