వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఢీ అంటే ఢీ... ఆరోపణలపై పరస్పరం కోర్టుకెక్కిన ఆప్, బీజేపీ..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ఢిల్లీ సిద్ధమైంది. దేశ రాజధానిలో ఆదివారం పోలింగ్ జరగనుండగా.. తూర్పు ఢిల్లీ నియోజకవర్గ బీజేపీ, ఆప్ అభ్యర్థుల మధ్య విమర్శలు వ్యక్తిగత స్థాయికి దిగజారాయి. గంభీర్ తనను కించపరుస్తూ పాంప్లెంట్లు పంచుతున్నారని ఆప్ అభ్యర్థి అతిషి కన్నీళ్లు పెట్టుకుంటోంది. తమ పరువుతీసిన ఆయనపై కోర్టుకీడ్చుతున్నానని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఆప్ నేతలపై కోర్టుకెక్కేందుకు సిద్ధమయ్యారు గౌతం గంభీర్.

సెక్సీ కామెంట్స్‌: క‌న్నీరు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్థినిసెక్సీ కామెంట్స్‌: క‌న్నీరు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్థిని

నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా

నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా

ఆప్ నేత అతిషి చేసిన విమర్శలను తూర్పు ఢిల్లీ నియోజకవర్గ అభ్యర్థి గౌతం గంభీర్ తీవ్రంగా ఖండించారు. తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే మరుక్షణమే పోటీ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. 'ఆరోపణల్ని ఖండిస్తున్నా. మహిళల్ని గౌరవించాలని నా కుటుంబసభ్యులు చిన్నప్పుడే నేర్పారు. అరవింద్ కేజ్రీవాల్ ఇంత దిగజారుతారని అనుకోలేదు. వారిపై పరువునష్టం కేసు దాఖలు చేశా'నని గంభీర్ ప్రకటించారు. 'కేజ్రీవాల్‌ లాంటి వ్యక్తి ఢిల్లీ సీఎంగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా' అని ట్వీట్ చేశారు.

నోటీసులు పంపిన గంభీర్

నోటీసులు పంపిన గంభీర్

తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న ఆప్ నేతలకు గంభీర్ నోటీసులు పంపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ నేత అతిషిలను కోర్డుకీడ్చుతానని హెచ్చరించారు. అసత్య ఆరోపణలు చేసినందుకుగానూ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన గంభీర్.. లేనిపక్షంలో పరువునష్టం దావా వేస్తానని తేల్చిచెప్పారు.

కోర్టుకెళ్తామంటున్న ఆప్

కోర్టుకెళ్తామంటున్న ఆప్

ఆప్ నేత అతిషిని అవమానించిన గౌతం గంభీర్‌ను కోర్టుకీడ్చుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. తాము తప్పుచేసి ఆప్ నేతలకు నోటీసులు పంపుతారా అని ఆగ్రహం వ్యక్తంచేసింది. 'మా పరువు తీసి మళ్లీ మాపైనే పరువునష్టం దావా వేస్తారా? బీజేపీ నేతలకే మేం పరువునష్టం నోటీసులు పంపుతున్నాం' అని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు.

గంభీర్ వర్సెస్ అతిషి

గంభీర్ వర్సెస్ అతిషి

ఢిల్లీ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో దిగిన గౌతం గంభీర్‌కు రెండు చోట్ల ఓటు హక్కు ఉందని ఆప్ నేత అతిషి ఆరోపించారు. దీనిపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై గంభీర్ ఘాటుగానే స్పందించారు. ఇరువురు నేతల మధ్య అప్పుడు మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు కోర్టుకు చేరింది.

English summary
BJP East Delhi candidate Gautam Gambhir has said he has filed a defamation case against AAP leaders after they accused him of distributing “derogatory” pamphlets. AAP said it will also file a defamation case against the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X