వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యావత్‌జాతికి గాంధీనే స్ఫూర్తి..ఆచరణలో మాత్రం ఎవరికీ వారే పోటీ

|
Google Oneindia TeluguNews

గాంధీ! ఈ పేరు స్ఫురణకు రాగానే చంటి పిల్లలనుంచి చరమాంకానికి చేరువవుతున్న వృద్ధుల వరకు ఒకే భావన ఉప్పొంగుతుంది. మన "బాపు" అంటూ ప్రతి ఇంటా ఆ పేరు జేగంటై మ్రోగుతుంది. ఆయన గురించి అందరి అభిప్రాయం ఒక్కటే. ఆయన మహాత్ముడు. సత్యము, అహింసలు ఆయన కొలిచిన దేవతలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన పూజాసామాగ్రి. ఈ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను ప్రజలు గుర్తించారు. నేడు జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి.... ఆయనను ఓ సారి గుర్తు చేసుకుంటూ ఆయన జీవితం పై ఓ స్పెషల్ స్టోరీ

గాంధీ విగ్రహానికి నల్ల రంగు పూసి .. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ పోస్టర్లు వేసి .. నిజామాబాద్ లో కలకలం గాంధీ విగ్రహానికి నల్ల రంగు పూసి .. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ పోస్టర్లు వేసి .. నిజామాబాద్ లో కలకలం

అవమానాలే గాంధీని గొప్ప నాయకుడిగా చేశాయి

అవమానాలే గాంధీని గొప్ప నాయకుడిగా చేశాయి

అక్టోబర్ 2, 1869లో గుజరాత్‌లోని పోర్బందర్‌లో జన్మించిన గాంధీ మెట్రిక్యులేషన్ పాసయ్యాక ఉన్నత చదువుల నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడే లా విద్యను అభ్యసించారు. తరువాత దేశానికి తిరిగొచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టి మూడేళ్ళపాటు బొంబాయి, రాజ్‌కోట్‌లలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళి 20 సంవత్సరాలకు పైగా అక్కడే నివాసమున్నారు. అక్కడ ఇతర భారతీయుల్లా అనేక అవమానాలకు గురయ్యారు. అవమానకరమైన ఈ సంఘటనలే ఆయన్ను ఓ గొప్ప నాయకుడుగా తీర్చిదిద్దాయి.

నా జీవితమే నా సందేశం అని చాటిన గాంధీ

నా జీవితమే నా సందేశం అని చాటిన గాంధీ


1915లో ఆయన భారతదేశానికి తిరిగొచ్చాక సబర్మతీ తీరాన ఆశ్రమాన్ని నిర్మించి, భారతదేశం మొత్తం పర్యటించారు. మాతృదేశం గురించి విజ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించిన తరువాత పూర్తిస్థాయిలో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని ఆయన సాగించిన పోరు దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించిపెట్టింది. ప్రపంచాన్ని నివ్వెరపోయేట్లు చేసింది. ఒకే ఒక్కడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి జాతి యావత్తునూ ఒక్కటి చేసి తన ఉద్యమం ద్వారా తన మనసునీ, తన మనసు ద్వారా తన జీవితాన్నీ, తన జీవితం ద్వారా ఓ మహా సందేశాన్ని అందించిన బాపు "నా జీవితమే నా సందేశం" అని చాటారు.

గాంధీ రాకతోనే రూపు సంతరించుకున్న స్వాతంత్ర్య సంగ్రామం

గాంధీ రాకతోనే రూపు సంతరించుకున్న స్వాతంత్ర్య సంగ్రామం

గాంధీ సందేశం వెనక ఆయన ఆరాటం, పోరాటం స్పష్టంగా కనిపిస్తాయి. ఆ సందేశం భారత జాతికే కాదు, విశ్వ జాతికీ అని ప్రపంచమంతా గ్రహించింది. అంతే కాదు ఆ సందేశం విశ్వ శాంతికి అని కూడా స్పష్టమైన సంకేతాన్నిచ్చింది.అప్పటివరకు దిశా నిర్దేశం లేని స్వాతంత్ర సంగ్రామం గాంధీ రాకతో ఒక రూపును సంతరించుకుంది. ఒక మార్గాన్ని ఏర్పరచుకుంది. ఒక నాదాన్ని అలవరచుకుంది. ఒక క్రమశిక్షణతో అడుగులేసింది. క్రమక్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరి మెట్టు చేరుకునే మార్గంలో అనేక ఉద్యమాలకు ఊపిరి పోసి, ఆ ఉద్యమాలలో విజయం సాధిస్తూ బ్రిటిష్ జెండాను ఎట్టకేలకు తల వంచేట్లు చేసింది.

అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా..

అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా..

ఆవిధంగా ప్రపంచంలోనే అత్యంత శక్తిసంపన్నదేశమైన బ్రిటన్... అహింసే ఆయుధంగా మలచుకున్న భారత్ ముందు తన ఆయుధ సంపత్తికి తిలోదకాలివ్వవలసివచ్చింది. అటువంటి ఆయుధ సంపత్తి ఏ దేశానికి ఎంతున్నా అహింస ముందు దిగదుడుపే అని అఖండ భారతావని ఋజువు చేసింది. భారత ప్రజలకు అటువంటి శక్తిని ప్రసాదించిన గాంధీ వ్యక్తిత్వం ప్రతి భారతీయుడి మదిలోనూ పదిలంగా నిక్షిప్తమై ఉంది. ప్రపంచ దేశాలకు అహింస యొక్క శక్తిని తెలియజేయడం ద్వారా గాంధీ తన సందేశాన్ని పరోక్షంగానే చెప్పినట్లయ్యింది. అందుకే మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబర్ 2ను "అంతర్జాతీయ అహింసా దినోత్సవం"గా యునైటెడ్ నేషన్స్‌లోని 114 సభ్య దేశాలు తీర్మానించాయి. అహింసవైపు అడుగేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి.

 ఐక్యరాజ్య సమితిలో మారుమోగిన గాంధీ పేరు

ఐక్యరాజ్య సమితిలో మారుమోగిన గాంధీ పేరు


అహింసతో సాధించలేనిది ఏదీ లేదని ఋజువు చేసిన గాంధీజీ బాటే ఏనాటికైన ప్రపంచపు బాట అవుతుందని హింసను ప్రోత్సహించే దేశాలు తెలుసుకోవాలి. ప్రపంచంలో నేడు ఎక్కడ హింస జరిగినా బాపూజీ అహింసా విధానం చర్చకు రాక మానదు. ఈ మధ్య ముగిసిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రధాని మోడీ తన ప్రసంగంలో గాంధీ గురించి అహింస గురించి ప్రస్తావించి ప్రపంచదేశాలను ఆకట్టుకున్నారు.మానవాళి మనుగడకోసం విశాల దృష్టితో అహింసను ప్రబోధించిన మహాత్ముడికి 150వ జయంతి సందర్భంగా నివాళి.

English summary
Today Nation is celebrating the 150th Birth anniversary of Father of The Nation Mahatma Gandhi. Mahatma Gandhi lead the Freedom movement with the weapon called Non Violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X