వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020: CAAతో నెరవేరిన గాంధీ కల, కర్తార్‌పూర్ కారిడార్ చారిత్రక ఘట్టం: రామ్‌నాథ్ కోవింద్

|
Google Oneindia TeluguNews

ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పౌరసత్వ సవరణ చట్టంతో మహాత్మాగాంధీ కల నేరిందని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రబీ, ఖరీఫ్ పంటల్లో రైతు పంటలకు మద్ధతు ధర ఇస్తున్నామని గుర్తుచేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతుల నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కిసాన్ సమ్మాన్ నిధితో 8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారత ర్యాంకు మరింత మెరుగుపడిందని పేర్కొన్నారు.

Recommended Video

Budget Session 2020 : President Ramnath Kovind Addresses The Joint Session Of Parliament
చారిత్రక ఘట్టం

చారిత్రక ఘట్టం

కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభించడం చారిత్రక ఘట్టమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. దీంతో దేశంలోని సిక్కులు తమ పవిత్ర స్థలాన్ని సందర్శించే వీలు కలిగిందనారు. దేశంలో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ ప్రజలు కూడా దేశంలో ఇతర ప్రాంతాల మాదిరిగా సమానహక్కులు పొందుతున్నారని చెప్పారు.

 అందరూ సమానమే

అందరూ సమానమే

మైనార్టీలను పాకిస్థాన్ టార్గెట్ చేసిందని పేర్కొన్నారు. కానీ భారత్‌లో అన్ని మతాలవారు సమానమేనని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంతో మహాత్మాగాంధీ కన్న కల ఇన్నాళ్లకు నేరవేరిందని చెప్పారు. విద్యతోపాటు వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కొత్తగా 65 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని వివరించారు. నన్‌కానా షాహిబ్ ఘటనను ఖండిస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు.

 2 లక్షల కోట్ల లావాదేవీలు

2 లక్షల కోట్ల లావాదేవీలు

పేదలందరికీ లబ్ది చేకూరలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత ఐదేళ్లలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుంని చెప్పారు. వెనబడిన వర్గాలు ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చిందన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. ఆన్‌లైన్ చెల్లింపులను ప్రభుత్వం ప్రోత్సహించిందని చెప్పారు. యూపీఏ ద్వారా రూ.2 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నామని ప్రభుత్వం చేపట్టిన పనుల వివరాలను రాష్ట్రపతి వివరించారు.

5 ట్రిలియన్ డాలర్లు

5 ట్రిలియన్ డాలర్లు

వన్ నేషన్, వన్ ట్యాక్స్ పేరుతో జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చామని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. మేకిన్ ఇండియా ఉత్పత్తిలో భారత్ పుంజుకొంది. తమ 5 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ కోసం ప్రభుత్వం ముందుడుగు వేస్తోందన్నారు. బాధితులకు సత్వర న్యాయం కోసం దేశంలో వెయ్యి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని వివరించారు. దీంతో దోషులకు సత్వరమే శిక్ష విధించే ఆస్కారం ఏర్పడిందని చెప్పారు. డిజిటల్ ఇండియా స్కీంతో గ్రామీణాభివృద్ధి జరుగుతోంది. వన్ నేషన్, వన్ మొబిలిటీ చాలామందికి ప్రయోజనం జరుగుతోంది.

మెట్రోతో మేలు

మెట్రోతో మేలు

గత ఆరేళ్లలో రహదారుల అనుసంధానం పెరిగింది. మారుమూల ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం పెరిగింది. అన్ని ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో తక్కువ సమయంలో ప్రయాణికులు సురక్షితంగా చేర్చగలుగుతున్నామని పేర్కొన్నారు. నమామీ గంగే పథకంతో గంగానదీ శుభ్రత కోసం పాటుపడ్డామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో అటవీ ప్రాంతం కూడా పెరిగింది. దీంతో వర్షపాతం పెరిగేందుకు దోహద పడిందన్నారు. వివిధ రంగాల్లో భారతదేశం విశేష ప్రతిభ కనబరిచిందని చెప్పారు.

అంతరిక్షంలో కూడా

అంతరిక్షంలో కూడా

చంద్రయాన్-2తో అంతరిక్షంలో కూడా భారత్ తన సత్తా చాటిందని చెప్పారు. ఇస్రో పలు కీలక ఉపగ్రహలను కక్ష్యలో ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. గగన్ యాన్, పీఎస్ఎల్వీ లాంటి ఉపగ్రహాలను నింగిలోకి పంపించందని చెప్పారు. చంద్రయాన్-3 ప్రాజెక్టు కూడా చేపట్టబోతున్నామని చెప్పారు. ఉగ్రవాదుల ఏరివేసేందుకు భద్రతా దళాలకు స్వేచ్చనిచ్చామని పేర్కొన్నారు.

English summary
gandhi dream come true on caa president ramnath kovind budget speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X