వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాత్ముడికి, లాల్ బహదూర్ శాస్త్రీకి మోడీ నివాళి, గాంధీజీ అంటే విగ్రహం కాదని రాహుల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/అమరావతి/హైదరాబాద్: భారత జాతిపిత మహాత్మా గాంధీకి ప్రపంచవ్యాప్తంగా నివాళులు అర్పించారు. బాపూజీ 150 జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, బీజేపీ సీనియర్ నేత అద్వానీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

ప్రధాని మోడీ గాంధీజీతో పాటు లాల్ బహదూర్ శాస్త్రీకీ నివాళులు అర్పించారు. మహాత్ముడి విలువైన మాటలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి బలాన్ని ఇచ్చాయని మోడీ ట్వీట్ చేశారు. భారత దేశాన్ని కీలకమైన సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి ముందుకు నడిపారని, బలానికి, సింప్లిసిటీకి ఆయన మారుపేరని మోడీ పేర్కొన్నారు. భారత్‌ను మరింత సంపన్నగా మార్చేందుకు శాస్త్రీ ఎంతో కృషి చేశారన్నారు.

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం ఆయన నాగూర్ వద్ద ఉన్న సేవాగ్రామ్ ఆశ్రమం వెళ్తారు. ఇక్కడ సాయంత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. 1942లో గాంధీజీ నేతృత్వంలో ఇక్కడ కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. రాజ్ ఘాట్ వద్ద రాహుల్ గాంధీతో పాటుసోనియా గాంధీ తదితరులు నివాళులు అర్పించారు.

బాపూజీ 150వ జయంతి: మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత పురస్కారం!బాపూజీ 150వ జయంతి: మహాత్మా గాంధీకి అమెరికా అత్యున్నత పురస్కారం!

గాంధీజీ అంటే కదలలేని విగ్రహం కాదని, దేశమంతా విస్తరించి ఉన్న విలువలు, జీవించి ఉన్న ఆలోచనలని, సత్యం, అహింస వీటి కోసమే ఆయన జీవించారని, దేశం కోసం చనిపోయారని, నిజమైన దేశ భక్తులు ఆయన విలువలను కాపాడాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Gandhi Jayanti 2018: PM Modi, President Kovind, Rahul Gandhi pay tribute to Mahatma Gandhi

తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), కేసీఆర్ (తెలంగాణ ఆపద్ధర్మ సీఎం) నివాళులు అర్పించారు. కేసీఆర్, గవర్నర్ నరసింహన్ బాపూ ఘాట్‌లో నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థనలు చేశారు.

English summary
As India remembers Mahatma Gandhi on his birth anniversary today, Prime Minister Narendra Modi offered floral tributes to 'Father of the Nation' at Delhi's Rajghat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X