• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Social media: సీఐకి జుట్టులేదని జుట్టు ఉండే పిల్లాడికి ఏం చేశాడంటే, సార్ కు చికెన్ 65 !

|

చెన్నై/హోసూరు/బెంగళూరు: శాంతిభద్రతలు కాపాడటానికి పోలీస్ ఇన్స్ పెక్టర్ (CI) సాటి పోలీసులతో కలిసి పెట్రోలింగ్ వాహనంలో వెళ్లాడు. అదే సమయంలో ఓ కుర్రాడు వెరైటీ హెయిర్ స్టేల్ తో అటువైపు వెళ్లాడు. ఆ కుర్రాడిని పిలిచిన సీఐ ఏమిట్రా నీ హెయిర్ స్టైల్ అని అడిగాడు. సార్ ఇది చికెన్ హెయిర్ స్టైల్ అని ఆ అబ్బాయి చెప్పాడు. అంతే సీఐకి ఎక్కడో మండిపోయి నేరుగా బార్బర్ షాప్ కు పిలుచుకుని వెళ్లి అతనికి చిప్ప కటింగ్ చేయించి ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ విషయంపై ప్రజలు, రాజకీయ నాయకులు మండిపడ్డారు. జుట్టులేని సీఐగారికి జుట్టు ఉన్న కుర్రాడికి ఏమి చేశారో మీరే చూడండి అంటూ సోషల్ మీడియాలో దూమరం రేపింది. కుర్రాడికి చిప్పకటింగ్ చేయించిన సీఐకి అధికారులు చికెన్ 65 రుచి చూపించారు.

Illegal affair: ప్రియుడికి పచ్చ జెండా, మొగుడికి ఎర్రజెండా, ఇద్దర్నీ ఎలా లేపేశారంటే !Illegal affair: ప్రియుడికి పచ్చ జెండా, మొగుడికి ఎర్రజెండా, ఇద్దర్నీ ఎలా లేపేశారంటే !

 సీఐ గణేష్..... సింగిల్ హ్యాండ్

సీఐ గణేష్..... సింగిల్ హ్యాండ్

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా (బెంగళూరు బార్డర్ లోని తమిళనాడు జిల్లా)లోని మహారాజకడై పోలీస్ స్టేషన్ లో గణేష్ కుమార్ అలియాస్ గణేష్ పోలీస్ ఇన్స్ పెక్టర్ (CI)గా ఉద్యోగం చేస్తున్నారు. సీఐ గణేష్ కుమార్ ను చూస్తే కొందరు ప్రజలు భయపడుతున్నారని సమాచారం.

 కుర్రాలకు సీఐ వార్నింగ్

కుర్రాలకు సీఐ వార్నింగ్

ఎప్పుడంటే అప్పుడు వీధుల్లో తిరుగుతున్న సీఐ గణేష్ అల్లరిమూకలకు, చిందులు వేసే కుర్రాలకు వార్నింగ్ ఇస్తున్నాడు. పగలు, రాత్రి అనితేడా లేకుండా ఆయన పరిధిలోని ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనంలో తిరుగుతున్న సీఐ గణేష్ కుమార్ ప్రజల్లో ఓ రకమైన గుర్తింపుతెచ్చుకున్నారు.

 సార్.... చికెన్ హెయిర్ స్టైల్

సార్.... చికెన్ హెయిర్ స్టైల్

ఈనెల 7వ తేదీన సీఐ గణేష్ కుమార్ ఇద్దరు పోలీసులతో కలిసి పెట్రోలింగ్ వాహనంలో పుసరపట్టి ప్రాంతానికి వెళ్లాడు. అదే సమయంలో 15 ఏళ్ల కుర్రాడు వెరైటీకి హెయిర్ కటింగ్ చేసుకుని అటువైపు వెళ్లాడు. ఆ బాలుడిని పిలిచిన సీఐ గణేష్ కుమార్ ఏమిటిరా నీ జుట్టు ఇలాగుంది అని ప్రశ్నించాడు. సార్.... ఇది చికెన్ హెయిర్ స్టైల్ అని ఆ అబ్బాయి సమాధానం ఇచ్చాడు.

 సీఐకి ఎక్కడో కాలిపోయింది

సీఐకి ఎక్కడో కాలిపోయింది

పిల్లోడు అది చికెన్ కటింగ్ సార్ అని చెప్పిన వెంటనే సీఐ గణేష్ కు ఎక్కడో కాలిపోయింది. వెంటనే ఆ అబ్బాయిని పోలీసు జీపులో ఎక్కించుకుని నేరుగా బార్బర్ షాపు దగ్గరకు వెళ్లాడు. చికెన్ కటింగ్ కాస్తా చిప్ప కటింగ్ చెయ్యాలని అక్కడ ఉన్న బార్బర్ కు సీఐ చెప్పాడు. సార్ వద్దు సార్, ప్లీజ్ అంటూ ఆ బాలుడు వేడుకుంటున్నా సీఐ గణేష్ మాత్రం వెనక్కి తగ్గలేదు.

 వీడియో తీసిన ఇన్స్ పెక్టర్

వీడియో తీసిన ఇన్స్ పెక్టర్

బార్బర్ షాప్ లో చిప్పకటింగ్ చేస్తున్న సమయంలో అవమానంతో ఆ పిల్లాడు బోరున విలపిస్తూ ఆర్తనాదాలు చేశాడు. అ సమయంలో ఆ సీఐ గణేష్ పిల్లాడికి చిప్పకటింగ్ చేస్తున్న సమయంలో వీడియో తీశాడు. పిల్లాడికి చిప్ప కటింగ్ చేయించిన సీఐ గణేష్ ఇక పోరా, ఇంకో సారి ఇలాంటి కటింగ్ చేసుకుంటే నీ కథ చూస్తా అంటూ ఆ పిల్లాడికి వార్నింగ్ ఇచ్చి పంపించేశాడు.

 పాపం సీఐకి జుట్టు లేదని ఇలా చేశాడా ?

పాపం సీఐకి జుట్టు లేదని ఇలా చేశాడా ?

15 ఏళ్ల పిల్లాడికి సీఐ గణేష్ చిప్పకటింగ్ చేయిస్తున్న సమయంలో తీసిన వీడియో ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. మైనర్ కు చిప్పకటింగ్ చేయించడమే కాకుండా ఆ పిల్లాడు పది మందికి తెలిసేలా చేసి మైనర్ మనోభావాలు దెబ్బతియ్యడానికి ప్రయత్నించిన సీఐ మీద అధికార పార్టీ నాయకులతో పాటు తమిళనాడులోని అనేక పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పిల్లాడు తప్పు చేస్తే వాళ్ల తల్లిదండ్రులను పిలిపించి చెప్పాలని, ఇలా ఎందుచేశాడు అంటూ అందరూ ప్రశ్నించారు.

 సీఐకి చికెన్ 65.... అంతే కథ

సీఐకి చికెన్ 65.... అంతే కథ

సోషల్ మీడియాలో బాలుడి చిప్పకటింగ్ వీడియో వైరల్ కావడంతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురైనాయి. విషయం తెలుసుకున్న క్రిష్ణగిరి జిల్లా ఎస్పీ పాండి గంగాధర్ విచారణకు ఆదేశించారు. పిల్లాడికి చిప్పకటింగ్ చెయ్యడమే కాకుండా అతని ముఖం స్పష్టంగా కనపడేలా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన సీఐ గణేష్ కుమార్ ను మహారాజ్ కడై పోలీస్ స్టేషన్ లో విధుల నుంచి తప్పించి ఆయన్ను సాయుధ బలగాల విభాగానికి బదిలీ చేసి విచారణ చేస్తున్నామని క్రిష్ణగిరి జిల్లా ఎస్పీ పాండి గంగాధర్ మీడియాకు చెప్పారు. పాపం శివరాత్రి పండగ రోజు సీఐని బదిలి చెయ్యడంతో ఆయనకు అసలు సిసలైన పండుగ కనపడిందని అబ్బాయి కుటుంబ సభ్యులు అంటున్నారు.

English summary
Social media: Ganesh Kumar, Inspector of Maharajakadai who cut the boy's hair, he has Transferred to the Armed Forces, krishnagiri Superintendent of Police order,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X