వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్ లో మహిళపై గ్యాంగ్ రేప్ .. ఫోన్లలో పోర్న్ కంటెంట్ , ఐటమ్ సాంగ్స్ ఎఫెక్ట్ శివానంద్ తివారీ

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్‌లోని డుమ్కా జిల్లాలో మంగళవారం సాయంత్రం 35 ఏళ్ల మహిళను 17 మంది మానవ మృగాలు భర్త చూస్తుండగానే సామూహిక అత్యాచారం చేశారన్న వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. జార్ఖండ్ లో డుమ్కా జిల్లాలో ముఫాసిల్ ప్రాంతంలో మార్కెట్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మహిళపై ఆమె భర్తను కట్టేసి, భర్త కళ్ళ ముందే సామూహిక అత్యాచారం చేశారని , మహిళ ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డిఐజి సుదర్శన్ మండల్ మీడియాతో అన్నారు.

మూడేళ్ళ బాలికపై మైనర్ బాలుర గ్యాంగ్ రేప్ .. పోక్సో చట్టం క్రింద కేసు నమోదుమూడేళ్ళ బాలికపై మైనర్ బాలుర గ్యాంగ్ రేప్ .. పోక్సో చట్టం క్రింద కేసు నమోదు

 మొబైల్ ఫోన్లలో అశ్లీల దృశ్యాలు, ఐటమ్ సాంగ్స్ వల్లే అత్యాచారాలన్న ఆర్జేడీ నేత

మొబైల్ ఫోన్లలో అశ్లీల దృశ్యాలు, ఐటమ్ సాంగ్స్ వల్లే అత్యాచారాలన్న ఆర్జేడీ నేత

ముఫాసిల్ పోలీస్ స్టేషన్లో నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో జార్ఖండ్ అత్యాచార ఘటనపై ఆర్జెడి నాయకుడు శివానంద్ తివారీ స్పందించారు . జార్ఖండ్ లో అత్యాచారాలు పెరగడానికి మొబైల్ ఫోన్లలో అశ్లీల దృశ్యాలు లభించడమే కారణమని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అత్యాచారం చేయాలని మనస్తత్వాన్ని ప్రేరేపించడానికి ఐటమ్ సాంగ్స్, ఫోన్లలో అశ్లీల కంటెంట్ ప్రధాన కారణాలని ఆయన ఆరోపించారు. ఇక ఇలాంటివి ఉన్నంతకాలం చట్టాలు కూడా ఈ దారుణాలను ఆపలేవని ఆయన పేర్కొన్నారు.

గిరిజన సంస్కృతి లో గతంలో ఇలాంటి ఘటనలు లేవు ..ఆధునిక పోకడలతోనే ఇలా

గిరిజన సంస్కృతి లో గతంలో ఇలాంటి ఘటనలు లేవు ..ఆధునిక పోకడలతోనే ఇలా

గిరిజన ప్రాంతాలలో గతంలో లేని సంస్కృతి ఇప్పుడు పెరిగిపోతుందని శివానంద్ తివారీ వ్యాఖ్యానించారు. ఇటువంటి సంఘటనలు జరగడం గిరిజనుల సంస్కృతిని నాశనం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గిరిజన సంస్కృతి లో అత్యాచారాలు ఇంతవరకూ జరగలేదని పేర్కొన్న శివానంద్ తివారీ, గిరిజనుల్లో కూడా ఆధునిక పోకడలు మొదలయ్యాక ప్రస్తుతం మహిళలను ఆట బొమ్మలుగా చూస్తున్నారు అంటూ మండిపడ్డారు.

 ఫోన్లలో మహిళలను ఉద్దేశించి అలా కంటెంట్ .. ఎన్ని చట్టాలు వచ్చినా ఏం మారదు

ఫోన్లలో మహిళలను ఉద్దేశించి అలా కంటెంట్ .. ఎన్ని చట్టాలు వచ్చినా ఏం మారదు

ఫోన్లలో మహిళలను ఉద్దేశించి అశ్లీల దృశ్యాలు, అశ్లీల నృత్యాలు, అశ్లీల కంటెంట్ వల్లనే ఎన్ని చట్టాలు వచ్చినా, ఈ పరిస్థితుల్లో మార్పు లేకుండా పోతుందని, ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చలేక పోతున్నాయని ఆయన పేర్కొన్నారు. నిర్భయ వంటి చట్టాలు వచ్చినా, మరణ శిక్షలు విధించినా ఇవి మాత్రం ఆగడం లేదని శివానంద్ తివారీ అభిప్రాయపడ్డారు జార్ఖండ్లో మహిళపై సామూహిక అత్యాచారం ఘటనపై బీహార్ ఉపముఖ్యమంత్రి రేణు దేవి జార్ఖండ్ ప్రభుత్వాన్ని విమర్శించారు .

ఇది జార్ఖండ్ ప్రభుత్వ తప్పిదం అన్న బీహార్ డిప్యూటీ సీఎం రేణూ దేవి

ఇది జార్ఖండ్ ప్రభుత్వ తప్పిదం అన్న బీహార్ డిప్యూటీ సీఎం రేణూ దేవి


ఇది జార్ఖండ్ ప్రభుత్వ అసమర్థత అని, తప్పిదం అని ఆమె మండిపడ్డారు . అత్యాచారాల నిషేధం కోసం చట్టాలు తీసుకువచ్చి వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు . నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ నాయకుడు సి పి సింగ్ నేరస్తులు పోలీసులు ఒకరితో ఒకరు అందరూ కలిసి పని చేస్తున్నారని హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

Recommended Video

Two Earthquakes In Karnataka, Jharkhand At The Same Time On Friday
 గ్యాంగ్ రేప్ ఘటనను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

గ్యాంగ్ రేప్ ఘటనను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

ఇదిలా ఉంటే జార్ఖండ్లో మహిళపై సామూహిక అత్యాచారం ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ అత్యాచార ఘటనను సుమోటోగా తీసుకుంది. లైంగిక వేధింపుల కేసులో రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఎమ్ హెచ్ ఏ మార్గదర్శకాలను పాటించాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ జార్ఖండ్ డీజీపీ కి లేఖ రాశారు . కేసులో తీసుకున్న చర్య పై సమగ్ర నివేదికను కూడా అందించాలని కోరారు . జార్ఖండ్ పోలీసు వెబ్‌సైట్ ప్రకారం, జూలై వరకు 1,033 అత్యాచారం కేసులు నమోదయ్యాయి, ఇది 2019 సంఖ్య కంటే ఎక్కువ. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) రికార్డుల ప్రకారం 2019 లో మొత్తం 1,416 అత్యాచార కేసులు నమోదయ్యాయి, అంటే రోజుకు సగటున నాలుగు కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి జార్ఖండ్ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది.

English summary
RJD leader Shivanand Tiwari reacted on jarkhand gang rape case, Shivanand Tiwari has blamed 'item dance, pornographic content on phones'' for instigating mindset of rape in Tribal societies. Speaking to news agency ANI, Tiwari said that attempts of modernising tribal societies have exposed them to content on mobile phones and that has added as an instigation for rape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X