వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగ్ వార్: వన్ వేలో కారు జంప్, డ్రైవర్ బలి (వీడియో)

|
Google Oneindia TeluguNews

గుర్గావ్: గ్యాంగ్ స్టర్స్ రెచ్చిపోయి నిత్యం రద్దిగా ఉండే రోడ్డులో కాల్పులకు పాల్పడటంతో ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన గుర్గావ్ లో జరిగింది. గుర్గావ్ లోని ఎంజీ రోడ్డు సమీపంలోని గుర్గావ్ సెంట్రల్ మాల్ సమీపంలో జరిగింది.

బుధవారం ఉదయం కారులో ఒక గ్యాంగ్ స్టర్ అతని అనుచరులు వెళుతున్నారు. అదే సమయంలో స్యాంట్రో కారులో నలుగురు ప్రత్యర్థులు వారిని వెంబడించారు. గర్గావ్ సెంట్రల్ మాల్ సమీపంలో ఒక్క సారిగా రివాల్వర్ లతో కారు మీద కాల్పులు జరిపారు.

 Gang War: Auto driver killed in Gurgaon

కారు డ్రైవర్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. రోడ్డు డివైడర్ ను డీకొట్టి వన్ వేలోకి దూసుకు వెళ్లి ఎదురుగా వస్తున్న వాహనాలను కారు డీకొంది. చివరికి ఒక ఆటో మీదకు కారు జంప్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పలు కార్లు పల్టీ కొట్టాయి.

అక్కడ ఉన్న కొందరు సినిమా షూటింగ్ జరుగుతుందని అనుకున్నారు. కొందరు ప్రాణభయంతో పరుగు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి చేతిలో బుల్లెట్ లు దూసుకు వెళ్లడంతో ఆసుపత్రికి తరలించారు. ఒక హత్య కేసులో జామీను మీద బయటకు వచ్చిన వ్యక్తిని అతని అనుచరులను అంతం చెయ్యడానికి ప్రయత్నించారని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Gunmen opened fire on an SUV near a big mall in Gurgaon this morning, causing the car to topple over onto an auto-rickshaw. The driver of the auto-rickshaw was killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X