వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్‌లోనూ అదే దారుణం: ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్..మూడు రోజుల పాటు..!

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మహిళలు,బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత మహిళపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై దేశం ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్న వేళ వరుసగా అత్యాచార ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి . ఇప్పుడు మరో కేసు రాజస్థాన్లో వెలుగులోకి రావటంతో బాలికల రక్షణ పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది . తల్లిదండ్రులు ఒకలా, పోలీసులు మరోలా చెప్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే

ఢిల్లీలో మైనర్‌పై గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు .. జీవితఖైదు పడిన హత్యాకేసు నేరస్థుడుఢిల్లీలో మైనర్‌పై గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు .. జీవితఖైదు పడిన హత్యాకేసు నేరస్థుడు

రాజస్థాన్ లో మైనర్లపై సామూహిక అత్యాచారం .. తండ్రి ఆరోపణ, పోలీసుల ఖండన

రాజస్థాన్ లో మైనర్లపై సామూహిక అత్యాచారం .. తండ్రి ఆరోపణ, పోలీసుల ఖండన

రాజస్థాన్ రాష్ట్రంలో ఇద్దరు మైనర్లను రాజస్థాన్‌లోని బారన్ నుంచి అపహరించి జైపూర్, కోటలకు తీసుకెళ్లి అక్కడ మూడు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారని వార్తలు వచ్చాయి . అయితే, ఇద్దరు మైనర్ బాలికలు తమ స్టేట్మెంట్లో అత్యాచారం ఆరోపణలను ఖండించారని పోలీసులు పేర్కొన్నారు. అయితే బాలికల తండ్రి మాత్రం తమ కుమార్తెలపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపిస్తున్నారు . బాలికల తండ్రి పోలీసులతో మాట్లాడుతూ, తమ కుమార్తె లపై అత్యాచారం చేశారని పేర్కొన్నారు .

సెప్టెంబర్ 18 నుండి మూడు రోజుల పాటు కనిపించని బాలికలు.. తండ్రి ఫిర్యాదు

సెప్టెంబర్ 18 నుండి మూడు రోజుల పాటు కనిపించని బాలికలు.. తండ్రి ఫిర్యాదు

ఇద్దరు నిందితులు, 13 మరియు 15 సంవత్సరాల వయస్సు గల మైనర్ బాలికలైన తమ కుమార్తెలను సెప్టెంబర్ 18 రాత్రి ఇంటి నుండి బయటకు రమ్మని చెప్పి వారిని జైపూర్ కోటకు తీసుకెళ్లారని , అక్కడ ఇద్దరు మైనర్ బాలురు, మరో ముగ్గురు కలిసి అత్యాచారం చేశారని తండ్రి ఆరోపించారు. బాలికలు కనిపించకపోవటంతో వారి కోసం వెతకగా వారు సెప్టెంబర్ 21 న జైపూర్ కోట వద్ద కనిపించారు . మైనర్ బాలికలు తమ స్టేట్మెంట్లో అత్యాచారం ఆరోపణలను ఖండించారని పోలీసులు పేర్కొనగా, వారిని చంపేస్తామని బెదిరించటంతో ఆ విధంగా చెప్తున్నారని బాలికల తండ్రి ఆరోపిస్తున్నారు .

 సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పి , పోలీసుల ముందు అదేమీ లేదన్న బాలికలు

సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పి , పోలీసుల ముందు అదేమీ లేదన్న బాలికలు

ఇద్దరూ కెమెరాలోమత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించారు. కానీ పోలీసుల ముందు అలాంటిదేమీ జరగలేదని చెప్పినట్టు తెలుస్తుంది . ఇద్దరు మైనర్ల కుటుంబాన్ని నిందితులు బెదిరిస్తున్నారని , నిందితులపై ఫిర్యాదు చేయవద్దని చెప్తున్నారని ఆరోపించారు బాలికల తండ్రి .ఈ సంఘటన గురించి బాలికల తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు నిందితులను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.

Recommended Video

Bollywood లో AR Rahman కి వ్యతిరేకం గా ఓ గ్యాంగ్, Bollywood Mafia పై AR Rahman || Oneindia Telugu
నిందితులు బెదిరిస్తున్నారని తండ్రి ఆరోపణ ..వరుస ఘటనలతో ఆందోళన

నిందితులు బెదిరిస్తున్నారని తండ్రి ఆరోపణ ..వరుస ఘటనలతో ఆందోళన

ఈ సంఘటన గురించి బాలికలు పోలీసులకు చెప్పినప్పుడు, నిందితులు పోలీసుల ముందు చంపేస్తామని బెదిరించారని కూడా బాలికల కుటుంబం ఆరోపించింది. అయితే ఈ కేసులో తల్లిదండ్రుల వాదన ఒకలా ఉంటే పోలీసులు అదేమీ లేదని , ఎలాంటి ఘటన జరగలేదని బాలికలు చెప్పినట్టుగా చెప్పటం గమనార్హం .హత్రాస్ లో 19 ఏళ్ళ యువతిపై సామూహిక అత్యాచారం చేయటంతో ఆమె మృతి చెందింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ లోనూ మైనర్ బాలికపై దారుణం జరిగింది .రాజస్థాన్ లో కూడా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వరుస భయానక ఘటనలను కళ్ళకు కడుతుంది .

English summary
Amid outrage over the gangrape and murder of a 19-year-old Dalit woman in Uttar Pradesh's Hathras, another case has now emerged from Rajasthan.Two minors were allegedly abducted from Baran in Rajasthan and taken to Jaipur and Kota where they gangraped for three days. Police have, however, claimed that the two minor girls denied the rape allegations in their statement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X