వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ ఇచ్చాడు! పరారయ్యాడు! యూపీ పోలీసులకు షాకిచ్చిన ఖైదీ

|
Google Oneindia TeluguNews

యూపీ : పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నేరస్థులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొందరు పోలీసులను పల్టీ కొట్టించడంలో సక్సెస్ అయితే మరికొందరు దొరికిపోయి మరిన్ని కేసుల్లో ఇరుక్కుంటారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ఖైదీ పోలీసుల చెర నుంచి తప్పించుకునేందుకు వేసిన మాస్టర్ ప్లాన్‌తో పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. ఒక ఇన్స్‌పెక్టర్ సహా ఆరుగురు కానిస్టేబుళ్లు కటకటాలు లెక్కపెడుతున్నారు.

పెళ్లికి హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు, లాడ్జ్ లో చెయ్యి కోసుకున్న లేడీ టెక్కీ, పోలీసులకు ఫోన్ చేసి!పెళ్లికి హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు, లాడ్జ్ లో చెయ్యి కోసుకున్న లేడీ టెక్కీ, పోలీసులకు ఫోన్ చేసి!

పోలీసులకు మందు పార్టీ

పోలీసులకు మందు పార్టీ

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బదాన్ సింగ్ ఓ గ్యాంగ్‌స్టర్. 1996లో ఓ లాయర్ హత్య కేసులో గతేడాది యావజ్జీవశిక్ష పడటంతో ఫతేనగర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిపై మరో పది కేసులు పెండింగ్‌లో ఉండటంతో వాటి విచారణ నిమిత్తం పోలీసులు అతన్ని ఘజియాబాద్ కోర్టుకు తీసుకెళ్తుంటారు. ఎప్పటిలాగే గురువారం కూడా ఆరుగురు ఎస్కార్ట్ పోలీసులు బదాన్ సింగ్‌ను కోర్టుకు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన అతను లిక్కర్ పార్టీ అరేంజ్ చేశానంటూ పోలీసులను మీరట్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తన అనుచరులతో కలిసి వారికి మందుపార్టీ ఇచ్చాడు.

మద్యం మత్తులో పోలీసులు, పరారీలో నిందితుడు

మద్యం మత్తులో పోలీసులు, పరారీలో నిందితుడు

హోటల్‌లో మందు తాగిన పోలీసులు స్పృహ కోల్పోయారు. ఇదే అదునుగా బదాన్ సింగ్ తన అనుచరులతో పరారయ్యాడు. దాదాపు 3 గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన పోలీసులు జరిగిన విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. విషయాన్ని పై అధికారులకు చెప్పారు.

పోలీసుల అరెస్ట్

పోలీసుల అరెస్ట్

గ్యాంగ్‌స్టర్ బదాన్‌సింగ్ దెబ్బకు పోలీసులే పోలీసులను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. విధి నిర్వాహణలో నిరక్ష్యంగా వ్యవహరించిన ఇన్స్‌పెక్టర్ సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. కేసు బుక్ చేసిన పోలీసులు త్వరలోనే బదాన్‌ను పట్టుకుంటామని ప్రకటించారు.

English summary
The Uttar Pradesh Police was left embarrassed after it emerged that gangster Badan Singh aka Baddo escaped custody while he was being taken to a court in Ghaziabad for a hearing. The 50-year-old who was serving a life sentence for the murder of a lawyer in 1996 escaped from a hotel after tricking the cops who escorted him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X