వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారు బోల్తా: గ్యాంగ్‌స్టార్ మృతి.. ఆవును తప్పించే ప్రయత్నంలో ప్రమాదం.. ముగ్గురికీ గాయాలు

|
Google Oneindia TeluguNews

వాంటెడ్ గ్యాంగ్‌స్టార్ ఫిరోజ్ అలీ అలియాస్ షమీ కారు బోల్తా పడటంతో చనిపోయారు. ఫిరోజ్ అలీ కోసం లక్నో పోలీసులు ముంబై వెళ్లారు. అక్కడ అతన్ని పట్టుకొని, కారులో తీసుకొస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం 6.30 గంటలకు జరిగిన ప్రమాదంలో కారు బోల్తా పడింది. గ్యాంగ్ స్టార్ ఫిరోజ్ చనిపోగా.. అందులో ఉన్న పోలీసులు గాయపడ్డారు.

ముంబై వెళ్లి..

ముంబై వెళ్లి..

లక్నోలోని థాకూర్ గంజ్ పోలీసులు ముంబై వెళ్లారు. ఏఎస్సై ప్రసాద్ పాండే, కానిస్టేబుల్ సంజీవ్ సింగ్, డ్రైవర్‌ సులభ్ మిశ్రాతో కలిసి ముంబై చేరుకున్నారు. ఫిరోజ్ అలీని.. నాలా సోపారా వద్ద గుర్తించారు. అప్రమత్తంగా వ్యవహరించి అరెస్ట్ చేశారు. వెంటనే అక్కడినుంచి కారులో లక్నో బయల్దేరారు. ఆదివారం ఉదయం మధ్యప్రదేశ్ గుండా కారు వెళుతుంది. ఉదయం 6.30 గంటలకు గుణ జిల్లా జాతీయ రహదారి 26 వద్ద వెళ్తుండగా.. కారు ఓ ఆవుకు అడ్డొచ్చింది. దానిని తప్పించే క్రమంలో బోల్తాపడింది.

ఫిరోజ్ బావమరిది కూడా

ఫిరోజ్ బావమరిది కూడా

అయితే కారులో ఫిరోజ్ బావమరిది అఫ్జల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఫిరోజ్ గురించి సమాచారం అఫ్జల్ ఇచ్చాడని.. అతనిని తీసుకొని ముంబై వచ్చినట్టు సమాచారం. ఆవును తప్పించే క్రమంలో కారు బోల్తా పడే సమయంలో ఫిరోజ్ అలీ, అప్జల్, సంజీవ్‌ను బయటకు తోసేశారు. అయితే గ్యాంగ్‌స్టార్ ఫిరోజ్ మాత్రం చనిపోయాడు. ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో అప్జల్ చేతి ఎముక కూడా విరిగింది.

పారిపోయిన అప్జల్..?

పారిపోయిన అప్జల్..?

ఘటనాస్థలానికి ఎస్సై రాజేశ్ కుమార్ సింగ్ చేరుకున్నారు. ఆవు అడ్డొచ్చిందని.. దానిని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగిందని ఎస్సై తెలిపారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ దూరం పడిపోయాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఇదిలా ఉంటే ఫిరోజ్‌ను వెతుక్కుంటూ వెళ్లిన అఫ్జల్ పారిపోయాడని ఏసీసీ సింగ్ తెలుపడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక పోలీసులు గాయపడ్డారని చెబుతుండగా.. ఏసీపీ మాత్రం పారిపోయాడని పేర్కొన్నారు.

English summary
wanted gangster feroz Ali alias Shammi died after a car belonging to a Lucknow police team overturned in Madhya Pradesh around 6:30 am on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X