వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. ఇదేం విచిత్రం.. గ్యాంగ్‌స్టార్ ఫోటోలతో పోస్టల్ స్టాంప్.. తప్పు ఎక్కడ జరిగిందంటే..?

|
Google Oneindia TeluguNews

పోస్టల్ స్టాంప్.. ఆయా సందర్భాన్ని బట్టి విడుదల చేస్తారు. అదీ జాతి కోసం త్యాగం చేస్తేనే వర్తిస్తోంది. చిన్న, చితక పనులు చేసినా.. ప్రస్తుత నేతలకు దాదాపుగా అవకాశం లేదు. అయితే ఉత్తరప్రదేశ్ పోస్టల్ అధికారులు మాత్రం ఏకంగా గ్యాంగ్ స్టార్ ఫోటోలతో స్టాంప్ వేశారు. ఇదీ సర్వత్రా చర్చానీయాంశమైంది. వాస్తవానికి తమ ఫోటో ముద్రించుకునే అవకాశం పోస్టల్ విభాగం కల్పించింది. అయితే సదరు వ్యక్తి మాత్రమే రావాలి.. కానీ ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది.

డాక్యుమెంట్స్ ఇలా..?

డాక్యుమెంట్స్ ఇలా..?

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌ పోస్టల్ సిబ్బంది నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్, గ్యాంగ్ స్టార్ మున్నా భజ్‌రంగీ ఫోటోలు దర్శనం ఇచ్చాయి. వీరిద్దరూ వాంటెడ్ లిస్ట్‌లో పేరున్న వారు కావడం విశేషం. పోస్టల్ విభాగం కొత్త అవకాశం కల్పించింది. ఓ వ్యక్తి తన ఫోటోను ముద్రించుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే అందుకు తగిన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.

12 స్టాంపులు..

12 స్టాంపులు..

ఒక షీట్‌లో 12 స్టాంపులు ఉంటాయి. ఒక్కో స్టాంప్ రూ.5 ఉంటుంది. ఒక షీట్ రూ.300 ఉంటుందని ఇండియాపోస్ట్.గవ్.ఇన్‌ సైట్‌లో ఉంది. దీంతో ఒకరు కాన్పూర్ పోస్టల్ సిబ్బందిని సంప్రదించారు. వారు తగిన డాక్యుమెంట్స్ మాత్రం చూపించలేదు. అయితే తనకు తెలిసినా వారు అని చెప్పడంతో.. పోస్టల్ సిబ్బంది సంతృప్తి చెందారు. ఇంకేముంది మన డాన్ ఫోటోలతో స్టాంప్ రెడీ అయ్యింది. అతను చూపించిన ఫోటోలను వెబ్ క్యామ్ తీసుకొని.. స్టాంపులను ముద్రించారని తెలిపారు.

Recommended Video

Andhra Pradesh : 'Jr.NTR To Become Next Chief Minister Of AP' Flexy Gone Viral
ఆ ఇద్దరూ వీరే..

ఆ ఇద్దరూ వీరే..

మున్నా భజ్‌రంగీ స్టాంప్ కోసం ప్రేమ్ ప్రకాశ్.. చోటా రాజన్ స్టాంప్ కోసం రాజేంద్ర ఎస్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. వారు ఇచ్చిన డాక్యుమెంట్లతో సంతృప్తి చెందారు. అయితే ఘటనపై తర్వాత విచారణ జరిపించారు. క్లర్క్ రజనీష్ బాబును సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందున విధుల నుంచి తప్పించారు. దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగుతోందని తెలిపారు.

English summary
Photos of dons and gangsters are common in 'Wanted' lists, but in Uttar Pradesh's Kanpur, their pictures have been printed on postage stamps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X