వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా కిరాతకంగా మన జవాన్ల నెత్తురు పారించిన గాల్వాన్ లోయలో పూలతోట అభివృద్ధి..

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఎనిమిది నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి సరిహద్దులో రక్తపాతం, తుపాకుల మోత చోటుచేసుకోవడం తెలిసిందే. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో గత జూన్ లో రెండు దేశాల సైనికులు హిసాత్మక ఘర్షణకు దిగగా, మన జవాన్లు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరుల నెత్తురుతో తడిచిన నేలను ఇప్పుడు పూలవనంగా మార్చుతున్నారు..

జగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామజగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామ

గాల్వాన్ లోయలో డ్రాగన్ బలగాలతో ముఖాముఖి తలపడి అమరవీరులైన భారత జవాన్లకు నివాళిగా పూల తోటను అభివృద్ధి చేస్తున్నారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఈ భారీ తోటల పెంపకాన్ని చేపట్టింది. 'గాల్వన్ కే బల్వాన్' పేరుతో ఈ ప్రాంతంలో 1,000 కి పైగా మొక్కలను నాటారు. -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ఈ ప్రాంతంలో అమరవీరుల గౌరవార్థం తోట పెంచుతున్నారు.

 Garden dedicating to martyrs soon in Galwan valley; ITBP plants over 1,000 saplings

ఐటీబీపీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతం పూర్తిగా బంజరు భూమిలా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి చెట్లు లేవు. -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు తక్కువ కాకుండా ఉండే వాతావరణంలో జీవించగలిగే మొక్కలను ఇక్కడ పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఐటీబీపీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సాశస్త్రా సీమాబల్ వంటి కేంద్ర పోలీసు దళాల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టారు. ఐటీబీపీ అమరవీరులకు అంకితం చేసేలా ఈ ఉద్యానవనాన్ని సృష్టిస్తున్నారు. ఈ డ్రైవ్ వచ్చే ఏడాది కూడా కొనసాగనున్నది. త్వరలోనే ఈ ప్రాంతమంతా పచ్చదనం పరుచుకునేలా చేయడమే ఈ డ్రైవ్‌ ఉద్దేశం.

కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్

చైనా, భారత దళాలు తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఏసీ వెంట మే ఆరంభం నుంచి స్టాండ్-ఆఫ్‌ విధుల్లో నిమగ్నమై ఉన్నాయి. గాల్వన్ లోయలో ఘర్షణ అనంతరం జూన్‌ నెలలో ఎల్ఏసీ వెంట పరిస్థితి క్షీణించడంతో.. ఇరుపక్షాలు ప్రాణనష్టానికి గురయ్యాయి. దాదాపు 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు లడఖ్‌లో చైనా దళాలు ఏకపక్షంగా చొచ్చుకు రావడంతో.. యథాతథ స్థితిని మార్చడానికి చేసిన ప్రయత్నం ఫలితంగా ఘర్షణ చోటుచేసుకున్నది.

English summary
A few kilometres away from the site where Indian security forces had a face-off with the Chinese Army in the Galwan Valley, the Indo-Tibetan Border Police (ITBP) has started a massive plantation drive. In the area, which has been named as 'Galwan ke Balwan', more than 1,000 saplings have been planted which includes part of Northern Ladakh as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X