వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మౌత్‌వాష్‌‍లతో కరోనా ప్రభావంలో క్షీణత: శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. మనదేశంలో అయితే, కషాయాలతోపాటు వేడినీటిని తరచుగా తాగితే కరోనా వైరస్ ప్రభావం తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

మౌత్‌వాష్‌లతో కరోనా కణజాలానికి చెక్..

మౌత్‌వాష్‌లతో కరోనా కణజాలానికి చెక్..

తాజాగా, కరోనాను తగ్గించే మరో ప్రక్రియ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మౌత్‌వాష్‌లతో పుక్కిలిస్తే నోరు, గొంతులోని కరోనావైరస్ కణజాలం తగ్గుతోందని తేలింది. ఫలితంగా స్వల్పకాలంపాటు ఇతరులకు కరోనా సంక్రమించే అవకాశం తగ్గుతుందని జర్మనీలోని రూర్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

కరోనా సంక్రమణ తగ్గిపోతుంది కానీ..

కరోనా సంక్రమణ తగ్గిపోతుంది కానీ..

అయితే, మౌత్‌వాష్‌ను ఉపయోగించి కరోనాను నయం చేయడం సాధ్యం కాదని తెలిపారు. సంక్రమణ వ్యాధుల జర్నల్‌లో అధ్యయనం వివరాలను ప్రచురించారు. కరోనా రోగుల గొంతు, కావిటీల్లో అత్యధిక మొత్తంలో వైరల్ లోడ్ కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ముక్కు చీదడం, శ్వాస వదిలినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, దగ్గినప్పుడు వైరస్ బయటకు వస్తోందని తెలిపారు. మౌత్‌వాష్‌లతో నోటిని పుక్కిలించడం ద్వారా కరోనావైరస్ కణాల సంఖ్య తగ్గి సంక్రమణకు అవకాశాలు తగ్గిపోతున్నాయని తెలిపారు.

కరోనావైరస్‌ను పూర్తిగా తొలగించే అవకాశం కూడా..

కరోనావైరస్‌ను పూర్తిగా తొలగించే అవకాశం కూడా..

పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు మౌత్‌వాష్‌ను వైరస్ కణాలతో నోటిలోని లాలాజలాన్ని పోలిన ద్రవాన్ని సృష్టించారు. 30 సెకన్లు పుక్కిలింత ఎఫెక్ట్ తర్వాత ఈ కణాలను పరీక్షించగా వైరస్ కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు అన్ని మౌత్‌వాష్‌లు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని మూడు రకాలైతే పూర్తిగా వైరస్‌ను తొలగించినట్లు కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు.

Recommended Video

COVID-19 : Oxford Corona Vaccine ఈ ఏడాదిలోనే.. సీరం సీఈవో వెల్లడి ! || Oneindia Telugu
వేడినీటిలో నిమ్మరసం, ఉప్పుతో కూడా..

వేడినీటిలో నిమ్మరసం, ఉప్పుతో కూడా..


అయితే, నోరు పుక్కిలించుకున్న తర్వాత ఎంత సమయం వరకు ఈ ప్రభావం ఉంటుందో తెలియదని చెప్పారు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, మరికొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నోరు పుక్కిలించుకోవడం వల్ల అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, మనదేశంలో కూడా ఉప్పు, నిమ్మరసం కలిపిన వేడి నీటిని ఉదయం పూట పుక్కిలించి ఉమ్మివేస్తే వైరస్ ప్రభావం తగ్గిపోతుందని, వైరస్ గొంతులో ఉంటే పూర్తిగా నశించిపోయే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

English summary
The novel coronavirus can be inactivated using commercially available mouthwashes, according to a study which says gargling with these products may reduce the quantities of viral particles in the mouth and throat, and possibly reduce the risk of Covid-19 transmission over the short term.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X