వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భలే విసిరాడే..: సరిగ్గా రాహుల్ మెడలో పడింది (వైరల్ వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

భలే విసిరాడే..: సరిగ్గా రాహుల్ మెడలో పడింది

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రచార వాహనంపై నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తూ సాగుతున్నవేళ.. జనంలో నుంచి ఓ అభిమాని విసిరిన పూలమాల నేరుగా వచ్చి ఆయన మెడలో పడింది.

గురువారం తుముకూరులో నిర్వహించిన రోడ్‌ షోలో ఈ ఘటన చోటు చేసుకుంది. దూరం నుంచి విసిరినప్పటికీ.. ఆ పూలమాల సరిగ్గా రాహుల్ మెడలో పడటం ఆయనతో పాటు కార్యకర్తలను ఆశ్చర్యపరిచింది. అనంతరం ఆ పూలమాలను తొలగించి అభిమానులకు అభివాదం చేస్తూ రోడ్‌షోను కొనసాగించారు రాహుల్.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో గురిచూసి రాహుల్ మెడలో పూలదండను విసిరిన అభిమానిని పలువురు నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు. అయితే రాహుల్ భద్రతా రీత్యా ఇది ఆందోళన కలిగించే అంశమని మరికొందరు వాపోతున్నారు. కాగా, మే 12 కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

English summary
A garland thrown by Congress supporter landed exactly around Rahul Gandhi’s neck during a roadshow in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X