వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ పోలీసుల సహాయం కావాలి: కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, కర్ణాటక పోలీస్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో తెలంగాణ ఇంటిలిజెన్స్ పోలీసుల సహాయం తీసుకుంటున్న కర్ణాటక సిట్ పోలీసు అధికారులు విచారణ వేగవంతం చేశారు. తెలంగాణ పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

గౌరీ లంకేష్ హత్య కేసులో నక్సల్స్ కు (మావోయిస్టులు) సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. నక్సల్స్ గౌరీ లంకేష్ ను హత్య చేశారని ప్రచారంలో ఉంది. గౌరీ లంకేష్ హత్యకు నక్సల్స్ కు సంబంధం ఉందని ఇప్పటి వరకూ ఇంటిలిజెన్స్ అధికారులకు ఎలాంటి సమాచారం లేదు.

Gauri Lankesh murder cops reach out to IB for naxal link

గౌరీ లంకేష్ హత్య కేసుకు సహకరించాలని సిట్ అధికారులు తెలంగాణ ఇంటిలిజెన్స్ అధికారులకు మనవి చేశారు. గౌరీ లంకేష్ హత్యకు నక్సల్స్ కు సంబంధం ఉందని ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదని సిట్ అధికారులు అంటున్నారు.

గౌరీ లంకేష్ హత్యతో నక్సల్స్ కు సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. నక్సల్స్ ఎవరినైనా హత్య చెయ్యాలంటే సుపారి (కిరాయి) ఇవ్వరని, వారే స్వయంగా హత్య చేస్తారని, కిరాయి హంతకులను ఆశ్రయించరని తెలంగాణ పోలీసులు సమాచారం ఇచ్చారని కర్ణాటక సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
The Karnataka police has reached out to the Telangana Intelligence Bureau in a bid to crack the Gauri Lankesh murder case. With the police investigating a possible naxal link to the murder, it has decided to seek inputs from the Telangana IB in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X