వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్‌ హత్య: హంతకుడ్ని ఆమె చూశారు, అసలా రోజు ఏం జరిగిందంటే..

తనను కాల్చి చంపిన కిల్లర్‌ను గౌరీ లంకేష్‌ నేరుగా చూసినట్టు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన సిట్‌ వర్గాలు తెలిపాయి. గౌరీ తొలుత తన ఇంటి తలుపు తీసి ఆయుధంతో తనను పిలిచిన కిల్లర్‌ను గమనించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూర్‌: తనను కాల్చి చంపిన కిల్లర్‌ను కన్నడ జర‍్నలిస్ట్‌, ఎడిటర్ గౌరీ లంకేష్‌ నేరుగా చూసినట్టు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన సిట్‌ వర్గాలు తెలిపాయి. వారి కథనం ప్రకారం.. గౌరీ తొలుత తన ఇంటి తలుపు తీసి ఆయుధంతో తనను పిలిచిన కిల్లర్‌ను గమనించారు.

వెనువెంటనే దుండగుడు ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు. మొదటి బుల్లెట్‌ ఆమె కుడి పక‍్కటెముకలోకి దూసుకుపోగా, రెండవ బుల్లెట్‌ ఎడమ పక్కటెముకకు తాకింది. తర్వాత రెండు అడుగులు వెనకకు వేసిన గౌరీ లంకేష్ గదిలో అటూ ఇటూ పరిగెత్తారు.

gauri-lankesh

అదే సమయంలో రెండడుగులు ముందుకొచ్చిన కిల్లర్‌ మళ్లీ కాల్పులు జరపగా మూడో బుల్లెట్‌ గురితప్పింది. నాలుగో బుల్లెట్‌ ఆమె వెన్నులో నుంచి దూసుకెళ్లి ఛాతీనుంచి బయటకు వచ్చిందని సిట్‌ వర్గాలు చెప్పాయి.

నాలుగో బుల్లెట్‌ తగిలిన అనంతరం గౌరీ లంకేష్ 30 నుంచి 60 సెకన్లు మాత్రమే ప్రాణాలతో ఉండి ఉంటారని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వర్గాలు పేర్కొన్నాయి.

English summary
The Special Investigation Team has got CCTV images from Gauri's house enhanced to gain a better view of what happened on September 5. Sources said Gauri had a clear view of her assailant. "Gauri, opening the gate to her house, turns towards the her house, turns towards the killer who calls her with weapon in hand. The assailant opens fire, and the bullet enters the right ribcage of Gauri. The second bullet lodges in the left rib. Gauri takes two steps back, spins around and takes 3-4 more steps when the assailant takes two steps forward and opens fire. The third bullet misses the target.The fourth bullet enters her back and exits through the heart," a source said. "She might have lived 30-60 seconds after being hit by the third bullet," the source said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X