బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తనను ఒకరు ఫాలో అవుతున్నట్లు గుర్తించిన గౌరీ లంకేష్, ట్విస్ట్‌లు

గుర్తు తెలియని వ్యక్తులు తనపై నిఘా పెట్టారని ఇటీవల మృతి చెందిన కన్నడ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ముందే గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె తల్లి వెల్లడించారు. కానీ, తనను చంపేంత ప్రమాదం ఉందని ఆమె గుర్తించలేదని తెల

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: గుర్తు తెలియని వ్యక్తులు తనపై నిఘా పెట్టారని ఇటీవల మృతి చెందిన కన్నడ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ముందే గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె తల్లి వెల్లడించారు. కానీ, తనను చంపేంత ప్రమాదం ఉందని ఆమె గుర్తించలేదని తెలుస్తోంది.

చదవండి: అప్పుడు మాట్లాడలేదే: సనాతన్ సంస్థ, గౌరీ లంకేష్ కాల్చివేతలో సోదరుడి కొత్త ట్విస్ట్ చదవండి: అప్పుడు మాట్లాడలేదే: సనాతన్ సంస్థ, గౌరీ లంకేష్ కాల్చివేతలో సోదరుడి కొత్త ట్విస్ట్

గౌరీ లంకేష్ సెప్టెంబర్ 2వ తేదీన తన సోదరి ఇంటికి వెళ్లారు. తనను ఒకరు ఫాలో అవుతున్నట్లు తన కూతురు చెప్పిందని గౌరీ లంకేష్ తల్లి చెప్పారు. అయితే, మేము కానీ గౌరీ లంకేష్ కానీ దీనిని అంత సీరియస్‌గా తీసుకోలేదని చెప్పారు.

కచ్చితంగా తెలియదని..

కచ్చితంగా తెలియదని..

అదే సమయంలో గౌరీ లంకేష్‌ను చంపేసింది, ఆమెను అనుసరించిన వ్యక్తేనా, కాదా తాము కచ్చితంగా చెప్పలేమని ఆ తల్లి చెప్పారు. గౌరీని నిందితులు 7.65 ఎంఎం పిస్టల్‌తో కాల్చి చంపిన విషయం తెలిసిందే.

ఆధారాలు ఇస్తే రూ.10 లక్షల నజరానా

ఆధారాలు ఇస్తే రూ.10 లక్షల నజరానా

ఇదిలా ఉండగా గౌరీ లంకేష్ హత్య కేసు విచారణలో కీలకమైన ఆధారాలు ఇచ్చిన వారికి రూ.10 లక్షల అవార్డు ఇవ్వనున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే సిట్ వేశారు. మరోవైపు, తమకు కర్నాటక ప్రభుత్వంపై నమ్మకం లేదని, సిబిఐ విచారణ జరిపించాలని రెండు రోజుల క్రితం గౌరీ లంకేష్ సోదరుడు విజ్ఞప్తి చేశారు.

గౌరీ లంకేష్ హత్య కేసులో ట్విస్ట్‌లు

గౌరీ లంకేష్ హత్య కేసులో ట్విస్ట్‌లు

గౌరీ లంకేష్ హత్యకు హిందుత్వ శక్తులు కారణమని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె నక్సలైట్ల నుంచి కూడా హేట్ లెటర్స్ అందుకున్నారు. ఆమె తీరుపై అసంతృప్తిగా ఉన్న కొందరు నక్సలైట్ల నుంచి ఆమెకు లేఖలు అందాయని తెలుస్తోంది.

అందుకే అసంతృప్తి

అందుకే అసంతృప్తి

గౌరీ లంకేష్‌కు హెట్ మెయిల్స్, హేట్ లేఖలు వచ్చాయని ఆమె కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. అందుకు కారణం కూడా ఉందన్నారు. పలువురు నక్సలైట్ల సరెండర్‌కు ఆమె కారణమని కొందరు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. సిట్ పలు కోణాల్లో దర్యాఫ్తు చేస్తోంది.

English summary
The Karnataka government has offered a 10 lakh award for clues in the murder of journalist Gauri Lankesh, even a special investigative team of the police set up to find the killers asked the public to share any information they might have to help solve the crime. Gauri Lankesh was killed at the doorstep of her Bengaluru home on Tuesday night. Footage from CCTV cameras installed by Ms Lankesh showed a man in a dark jacket and helmet shoot her at pointblank range. But almost three days after her death, the police have made little headway in its investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X