వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ సంపన్నుల టాప్10 జాబితా నుండి గౌతమ్ అదానీ ఔట్.. ప్రస్తుతం ఆయన స్థానమిదే!!

ప్రపంచ సంపన్నుల జాబితా టాప్ 10 నుండి గౌతమ్ అదానీ నిష్క్రమించారు. భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్ కు చెందిన అత్యధిక షేర్ల కంపెనీలు వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో భారీగా పతనం కావడంతో ఆయన సంపద భారీగా ఆవిరి

|
Google Oneindia TeluguNews

నిన్న మొన్నటి వరకు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో టాప్ టెన్ లో స్థానం దక్కించుకున్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ టెన్ సంపన్నులు జాబితా నుండి నిష్క్రమించారు. భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్ కు చెందిన అత్యధిక షేర్ల కంపెనీలు వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో భారీగా పతనం కావడంతో ఊహించని విధంగా ఆయన సంపద ఆవిరి అయిపోయింది.

ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ టెన్ నుండి అదానీ అవుట్

ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ టెన్ నుండి అదానీ అవుట్


గత మూడు ట్రేడింగ్ సెషన్లలో గౌతమ్ అదానీకి చెందిన సంపద 34 బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది. ప్రస్తుతం ఆయన 84.4 బిలియన్ల డాలర్ల సంపదతో 11వ స్థానంలో ఉన్నారు. భారతీయ వ్యాపారవేత్త బ్లూమ్ బెర్గ్ బిలినీర్స్ ఇండెక్స్ లో నాలుగవ స్థానం నుండి 11వ స్థానానికి పడిపోయారు. కేవలం మూడు రోజుల్లోనే అదానీ ప్రపంచ సంపన్నులలో 11వ స్థానానికి దిగిపోయారు.

హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక ఎఫెక్ట్

హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక ఎఫెక్ట్


ఇక అతని తర్వాతి స్థానంలో 82.2 బిలియన్ డాలర్ల సంపదతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. అదానీ కంటే ముందు మెక్సికో సంపన్నుడు అయిన కార్లోస్ స్లిమ్ ఉన్నారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూపు కంపెనీల షేర్లు హిండెన్ బర్గ్ రీసెర్చ్ .. నివేదిక వల్ల తీవ్రంగా దెబ్బతింది. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. దీనిపై రెండేళ్ల పాటు పరిశోధన చేసి నాలుగు రోజుల కిందట రిపోర్టును విడుదల చేసింది.

అదానీ గ్రూప్ భారీ మోసాలకు పాల్పడుతుందని ఆరోపణలు .. మార్కెట్ లో అదానీ సంపద ఆవిరి

అదానీ గ్రూప్ భారీ మోసాలకు పాల్పడుతుందని ఆరోపణలు .. మార్కెట్ లో అదానీ సంపద ఆవిరి


ఇక దీనికి ప్రతిస్పందనగా అదానీ గ్రూప్ కూడా 413 పేజీల రెస్పాన్స్ ను విడుదల చేసింది. అయినప్పటికీ హిండెన్ బర్గ్ తన నివేదికను సమర్థించి మరోమారు అదానీ గ్రూప్ పై విరుచుకుపడింది. జాతీయవాదాన్ని అడ్డుపెట్టుకొని అదానీ గ్రూప్ భారీ మోసాలకు పాల్పడుతోందని మరోమారు ఆరోపించింది. ఇక అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు విపరీతంగా పడిపోతున్నాయి. మార్కెట్ విలువలో 68 బిలియన్ల డాలర్లకు పైగా తుడిచిపెట్టకుపోయాయి. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ కూడా ఇప్పటికే ఐదు లక్షల కోట్లకు పైగా పతనమైంది.

అదానీ కంపెనీల షేర్లు పతనం కొనసాగితే ఆసియా కుబేరుల్లో టాప్ 1 స్థానం కూడా ఔట్

అదానీ కంపెనీల షేర్లు పతనం కొనసాగితే ఆసియా కుబేరుల్లో టాప్ 1 స్థానం కూడా ఔట్

గత రెండు రోజుల ట్రేడింగ్ సెషన్లలో పెట్టుబడులు పెట్టిన వారి సంపద దాదాపు పదిలక్షల కోట్ల రూపాయల మేర పతనమైంది. మొత్తంగా చూస్తే గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగవ స్థానం నుండి 11వ స్థానానికి పడిపోగా, ఈరోజు మార్కెట్లో కూడా వరుసగా అదానీ గ్రూప్ షేర్లు పడిపోతే ఆసియాలో కుబేరుడుగా మొదటి స్థానం నుండి గౌతమ్ అదానీ కిందికి వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు అదానీ స్థానంలో ఆసియాలో కుబేరుడిగా ముఖేష్ అంబానీ నిలుస్తారు. ఆసియా కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ రెండవ స్థానంలో ఉన్నారు. ఇక అదానీకి అంబానీకి మధ్య సంపదలో వ్యత్యాసం రెండు బిలియన్ల డాలర్లే కావడంతో, అదానీ సంపద మరింత పతనం అయితే ఆయన ఆసియా కుబేరుల జాబితాలో తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోతారు. అంబానీ వెనుకకు చేరుకుంటారు.

స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టే.. యూజీసీ కొత్త నిబంధన; ఇకపై విద్యార్థులకు అది తప్పనిసరి!!స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టే.. యూజీసీ కొత్త నిబంధన; ఇకపై విద్యార్థులకు అది తప్పనిసరి!!

English summary
Gautam Adani has dropped out of Bloomberg's top 10 list of the world's richest people. His wealth evaporated as the shares of Adani's companies plummeted. With this, he fell to the 11th position.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X