మహాకుంభమేళలో అదానీ: మానవసేవే మాధవ సేవ అంటోన్న వ్యాపార దిగ్గజం..!!

ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ ఛైర్మెన్ గౌతం అదానీ జనవరి 21వ తేదీన ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళను సందర్శించారు. గౌతం అదానీ కుంభమేళాను సందర్శించడం ఆయనలోని ఐక్యత,స్వచ్ఛత,సేవా గుణాలను చాటుతోంది. మానవ సేవే మాధవ సేవ అని భావించే అదానీ.. ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తూ తనవంతు సహాయం కూడా చేస్తున్నారు.

మహాకుంభమేళ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఇస్కాన్ సేవా క్యాంప్‌ను తొలుత సందర్శించిన అదానీ, తన సంస్థ ఇస్కాన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మహాప్రసాద సేవ ద్వారా రోజుకు లక్ష మంది భక్తులకు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నారు. మహా ప్రసాద తయారీ చేసే కిచెన్‌లను అదానీ పర్యవేక్షించారు. మహాకుంభమేళకు తరలివచ్చే భక్తులకు అన్నదానం చేయడమంటే గంగమ్మకు సేవ చేయడమే అని అదానీ అన్నారు. స్వచ్ఛమైన హృదయంతో సేవ చేస్తే అది నేరుగా భగవంతుని వద్దకు చేరుతుందని చెబుతూ దేవుడి పట్ల తనకున్న భక్తిని చాటుకున్నారు.

Gautam Adani Visits Prayagraj and ISKCON A Blend of Service and Spirituality

ఇస్కాన్‌ను సందర్శించిన తర్వాత గౌతమ్ అదానీ నేరుగా త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు. గంగా, యమునా, సరస్వతీ ఈ మూడు పుణ్య నదులు కలిసే సంగమంను సందర్శించారు. ఈ మూడు నదుల కలయిక లేదా సంగమం ఏర్పాటు వెనుక గొప్ప చరిత్ర ఉంది. క్షీరసాగర మథనం చేసేటప్పుడు కొన్ని అమృత చుక్కలు ఈ సంగమంలో పడ్డాయనే విశ్వాసం ఉంది. అందుకే దీన్ని అత్యంత పవిత్ర సంగమంగా భక్తులు భావిస్తారు.త్రివేణి సంగమంను దర్శించుకున్న అదానీ దేశంతో పాటు తన కుటుంబం కూడా సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ప్రత్యేక పూజలు చేశారు.

ప్రయాగ్‌రాజ్ లేదా తీర్థరాజ్‌కు ఆధ్యాత్మికంగా చరిత్రలో ప్రాముఖ్యత ఉంది.ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న హనుమాన్ ఆలయాన్ని అదానీ సందర్శించారు.దేశంలో ఉన్న 16 ప్రముఖ హనుమాన్ ఆలయాల్లో ఒకటి ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. అదానీ ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ఈ ఆధ్యాత్మిక నగరం పట్ల తనకున్న భక్తిని, గౌరవాన్ని చాటుకున్నారు.

Gautam Adani Visits Prayagraj and ISKCON A Blend of Service and Spirituality

మహాకుంభమేళ సందర్భంగా గీత ప్రెస్ క్యాంప్ వారు అక్కడికి వచ్చిన భక్తులకు ఆర్తి సంగ్రాహ్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.ఈ సందర్భంగా గీతా ప్రెస్ క్యాంప్‌ను సందర్శించి వారు చేస్తున్న ఈ కార్యాన్ని అదానీ అభినందించారు. భారత సంస్కృతి, ఆధ్యాత్మికతను పరిరక్షించడంలో సనాతన సాహిత్యం కీలక పాత్ర పోషిస్తోంది. శతాబ్దాలుగా ఈ సనాతన సాహిత్యాన్ని అందించడంలో గీత ప్రెస్ క్యాంప్ చేస్తున్న కృషిని అదానీ కొనియాడారు.

కుంభమేళ పరిసర ప్రాంతాలు స్వచ్ఛంగా,శుభ్రంగా ఉన్నాయంటే అందుకు కారణం అక్కడ నిత్యం పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను అదానీ కలిసి పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు వారు చేస్తున్న కృషిని అభినందించారు. అలుపు లేకుండా వారు పడుతున్న కష్టాన్ని చూసిన అదానీ వారిని మెచ్చుకున్నారు. కొన్ని లక్షల మంది భక్తులు కుంభమేళకు తరలివస్తుంటారు. ఈ సందర్భంగా పరిసరాలు శుభ్రం లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక్కడే పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనిచేస్తుంటారు.

ఇక మహాకుంభమేళకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని వారికి అదానీ గ్రూప్ అన్ని ఏర్పాట్లను చేసింది. ముఖ్యంగా వృద్ధులకు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలను కల్పించింది. ఇంతేకాదు ఐదు లక్షల గీతా సార్ కాపీలను సిద్ధంచేసి పంపిణీ చేయడం ద్వారా భగవద్‌గీత యొక్క గొప్పతనాన్ని భక్తులకు తెలియపరుస్తోంది అదానీ సంస్థ.

అదానీ గ్రూప్‌ జనవరి 13న ప్రారంభించిన మహాప్రసాదం లేదా అన్న దాన కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుంది.50 లక్షల మంది భక్తులకు ఉచిత భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది.ఈ భోజనం తయారు చేసేందుకు ఇస్కాన్ సంస్థ రెండు భారీ వంటశాలలను ఏర్పాటు చేసింది. మహాకుంభమేళ జరిగే ప్రాంతంలో 40 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు ఉచిత భోజనాన్ని అందిస్తోంది.

భారత సంస్కృతిలో మహాకుంభమేళ ఒక గొప్ప యజ్ఞంగా అభివర్ణించారు గౌతం అదానీ.దాతృత్వంలో సేవకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. భారతదేశ సంస్కృతిని ఆధ్యాత్మికతను మరింత ప్రజ్వలించేలా అదానీ ప్రయాగ్ రాజ్ పర్యటన కొనసాగింది. ఆధ్యాత్మికత,సేవ మేళవింపుతో అదానీ కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు నిజంగా అభినందనీయం. అన్నదాన సేవ, గీత ప్రెస్, పరిసరాల పరిశుభ్రతపై శ్రద్ధతో పాటు పలు అంశాలపై అదానీ సంస్థ చూపిన చొరవ సహకారం మహాకుంభమేళను మరో ఎత్తుకు తీసుకెళ్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+